సంక్రాంతి బరిలో రవితేజ 'మిరపకాయ్' గెలిచింది!?
సంక్రాంతి బరిలో నిలిచి గెలిచిన మా 'మిరపకాయ్'ని అభినందిస్తున్నాను. మా హీరో రవితేజగారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుందని, పాటలు సూపర్ అని, హరీష్ శంకర్ టేకింగ్ అద్భుతమని అందరూ ప్రశంసిస్తున్నారు అన్నారు రమేష్ పుప్పాల. ఆయన రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై నిర్మించిన 'మిరపకాయ్' చిత్రం గురువారం విడుదలైంది. ఈ సినిమా విజయవంతమైందంటూ మీడియా సమావేశం నిర్విహించి ఇలా సంక్రాంతికి విజేతగా ఈ చిత్రాన్ని అభివర్ణించారు. అలాగే సినిమాకి మంచి ఓపెనింగ్స్ లభించాయని ఆయన అన్నారు.అలాగే మొదటి నుంచి ఈ సినిమా మీద నాకున్న నమ్మకం నిజమైనందుకు హ్యాపీగా ఉంది. ప్రేక్షకులు అందించిన విజయం మరిన్ని సినిమాలు తీయడానికి ప్రోత్సాహాన్నిచ్చింది అన్నారు. మా సంస్థ తొలిసారిగా నిర్మించిన 'మిరపకాయ్' చిత్రానికి హిట్ టాక్ రావడం ఆనందంగా ఉంది అన్నారు. ఇంతకీ మిరపకాయ సంక్రాంతి విజేతే నంటారా?


Click it and Unblock the Notifications











