twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దీపిక పడుకొనె, నిర్మాత మధ్య వివాదం

    By Bojja Kumar
    |

    బాలీవుడ్ హాట్ బేబీ దీపిక పడుకొనె. రేస్-2 సినిమా నిర్మాత రమేష్ తౌరాని మధ్య వివాదం నెలకొంది. దీంతో ఆ నిర్మాత CINTAA (Cine & TV Artistes Association)లో ఫిర్యాదు చేశారు. తాను నిర్మిస్తున్న రేస్-2 చిత్రంలో నటించడానికి ఓకే చెప్పిన దీపిక 6 రోజులు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత సినిమా నుంచి తప్పుకుందని, దీని వల్ల తాను ఎంతో నష్ట పోతానని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె రేస్-2 సినిమాలో నటించాలని రమేష్ తౌరాని డిమాండ్ చేస్తున్నాడు.

    నిర్మాత ఫిర్యాదు మేరకు CINTAA దీపిక నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధం అవుతోంది. దీపిక నుంచి ఎలాంటి స్పందన రాక పోతే... FWICE (Federation of Western India Cine Employees)కు ఫిర్యాదును బదిలీ చేయనున్నారు.

    అయితే దీపిక సన్నిహితుల నుంచి వినిపిస్తున్న వాదన మరోలా ఉంది. ఈ సినిమా నుంచి తప్పకోవడంలో దీపిక తప్పేమీ లేదని, నిర్మాత ఆమెతో అగ్రిమెంట్ కుదుర్చుకునే సమయంలో సెప్టెంబర్ 2011లోపు సినిమా పూర్తవుతుందని చెప్పారని, ఇప్పుడు మనం ఫిబ్రవరి 2012లో ఉన్నాం. అయినా సినిమా పూర్తి కాలేదు. అందుకే సినిమా నుంచి తప్పకుంది. అతని వద్ద తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వడానికి సిద్దంగా ఉంది. న్యాయం దీపిక తరుపునే ఉందంటున్నారు. ఇరు వర్గాల వాదనల నేపథ్యంలో అసోసియేషన్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

    English summary
    He called her "unprofessional". And her action "unethical". But Race 2 producer Ramesh Taurani is still not satiated. On Thursday, the filmmaker has filed a complaint with CINTAA (Cine & TV Artistes Association) against Deepika Padukone, who left his project after shooting for it for six days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X