'వీర' రమేష్ వర్మ "శ్రీశ్రీ" సినిమాను ఆ హీరోతో కన్ఫర్మ్
రీసెంట్ గా రవితేజకు వీర అనే డిజాస్టర్ సినిమాని ఇచ్చిన దర్శకుడు రమేష్ వర్మ. ఆయన "శ్రీశ్రీ" టైటిల్ తో మరో చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న ఈ చిత్రంలో సిద్దార్ధని హీరోగా తీసుకున్నట్లు తెలుస్తోంది. సిద్దార్ద హీరోగా నందినీ రెడ్డితో సినిమా ప్లాన్ చేసారు.అయితే సిద్దార్ద ఎక్కువగా ఇన్వాల్వ్ కావటంతో నందినీ రెడ్డి తన చిత్రానికి హీరోగా రవితేజని అనుకుని కలిసి ఒప్పించుకుంది.దాంతో సిద్దార్ద డేట్స్ ని ఇటు సర్దుబాటు చేసి సినిమా చేయాలని బెల్లంకొండ నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.
మరో సినిమా సెట్ అయినట్లు సమాచారం. ఇక "శ్రీశ్రీ" టైటిల్ ని సుకుమార్ 'జగడం' సినిమాకు పెడదామనుకుని విరమించుకున్నాడు. అప్పట్లో రమేష్ వర్మ దీన్ని హైజాక్ చేసి రిజస్టర్ చేయించుకున్నాడని చెప్పుకున్నారు. ఇక ఈ కథ "శ్రీ"వల్లీ అనే అమ్మాయి, "శ్రీనివాస్" అనే అబ్బాయిల మధ్య సాగే ఓ అందమైన ప్రేమకథా చిత్రం కనుక "శ్రీశ్రీ" అనే పేరును ఖరారు చేసినట్లు రమేష్ వర్మ చెప్పుతున్నారు.


Click it and Unblock the Notifications











