కొజ్జా**కు అన్నందుకు: వర్మ బాగానే హర్ట్ అయినట్టున్నాడు, ఆవేదనగా పోస్ట్
నంది అవార్డ్స్ ఎంపిక పై జ్యూరీ మీద వర్మ అభిప్రాయానికి బూతులతో స్పందించిన మద్దినేని పోస్ట్ చూసిన వర్మ దానిపై స్పందించారు. రమేష్ వ్యాఖ్యలను యథావిధిగా పోస్ట్ చేయడమే కాకుండా దానికి తన రిప్లైని జత చేశారు.
Recommended Video

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులను విమర్శించిన వాళ్లను బూతులు తిడుతూ దర్శకుడు మద్దినేని రమేష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టులు పెడుతూ, రాంగోపాల్ వర్మపై మండిపడ్డాడు. రామ్‌గోపాల్ వర్మ చేసిన ఆరోపణలను తప్పుపడుతూ తీవ్రంగా స్పందించాడు.

అయినా బుద్ధి తెచ్చుకోలేదు
కుటుంబ సభ్యులతో చీకొట్టించుకున్నాడని, అయినా బుద్ధి తెచ్చుకోలేదని విమర్శించాడు. అది చూసిన వర్మ దానిపై స్పందించారు. రమేష్ వ్యాఖ్యలను యథావిధిగా పోస్ట్ చేయడమే కాకుండా దానికి తన రిప్లైని జత చేశారు. ఆ రిప్లై వర్మ మాటల్లోనే...

అభిప్రాయం వ్యక్తపరిచే హక్కు
ఒక ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న ఒక విషయం మీద అభిప్రాయం వ్యక్తపరిచే హక్కు ఎవరికైనా ఉంటుంది. అలాగే నేను నంది అవార్డులు ఇచ్చిన వైనంపై స్పందించాను. దానికి సమాధానంగా గౌరవనీయమైన అవార్డ్ కమిటీ మెంబరు మద్దినేని రమేష్ బాబు కింది విధంగా స్పందించారు.

బన్ని గాళ్ళు, బుజ్జి గాళ్ళు, బండ్ల గాళ్ళు
నిజానికి ముందు పోస్ట్ లో భయంకరమైన బూతులు వాడిన మద్దినేని బన్ని గాళ్ళు, బుజ్జి గాళ్ళు, బండ్ల గాళ్ళు అంటూ పోస్ట్ చేసిన మద్దినేని తర్వాత దాన్ని ఎడిట్ చేసారు. అయితే ఆయన ఎడిట్ చేతటానికి ముందే దాన్ని స్క్రీన్ షాట్ తీసిన వర్మ దాన్ని తన వాల్ మీద పోస్ట్ చేసాడు.

వర్మ బాగా హర్ట్ అయినట్టున్నాడు
సెక్యూరిటీ లేకుండా బయట తిరగలేని బతుకు బతుకుతున్నాడని నిప్పులు చెరిగాడు.బక్కగాల్లకీ బలుసుగాల్లాకీ బలుపుగాల్లకీ బఫూన్గాల్లకీ అంటూ నంది అవార్డుల విధానాన్ని విమర్శించిన బన్నీ వాసు, నల్లమలపు బుజ్జి, బండ్ల గణేశ్ తదితరులనూ వదల్లేదు. బన్నీ గాళ్ళు అంటూ అల్లు హీరోలనీ, బుజ్జిగాళ్ళూ అంటూ నల్లమలుపు బుజ్జి నీ, బండ్లగాళ్ళూ అంటూ నిర్మాత బండ్ల గణేష్ నీ ప్రస్తావిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్ మీదనే వర్మ బాగా హర్ట్ అయినట్టున్నాడు.

నాకేం బాధ లేదు
నన్ను తిట్టినందుకు నాకేం బాధ లేదు... కానీ ఇలాంటి వ్యక్తులని అవార్డ్ కమిటీలో ఎన్నుకున్నందుకు ప్రభుత్వం మీద బాధగా ఉంది. ఇలాంటి వ్యక్తులని మెంబర్లుగా ఎన్నుకున్న ప్రభుత్వం పట్ల ఆశ్చర్యపడాలో జాలిపడాలో నాకు తెలియడం లేదు. అన్నం గురించి తెలియటానికి ఒక్క మెతుకు చాలంటారు. ఈ మద్దినేని రమేష్ బాబు ఆ మెతుకైతే అన్నం కమిటీ అనుకునే పరిస్తితి వచ్చినందుకు వివరణ ప్రభుత్వమే చెప్పాలి.


Click it and Unblock the Notifications











