twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కొడుకు పేరు చాలా గొప్పదే: "పవనోవిచ్" ని కూడా వదలని వర్మ

    భాషలు పుట్టిన తరువాత తాను విన్న పేర్లలో అత్యంత గొప్పది "పవనోవిచ్" అని చెప్పాడు. ఇలా పవన్ కళ్యాణ్‌నే కాదు ఇక పవనోవిచ్ మీద కూడా యుద్దం మొదలు పెట్టాడు వర్మ...

    |

    పవన్ కళ్యాణ్, రామ్‌గోపాల్ వర్మ ఈ ఇద్దరిమధ్యాఎప్పుడూ ఏదో ఒక వ్యవహారం లో యుద్దం జరుగుతూనే ఉంటుంది. పవన్ తగ్గినా వర్మ మాత్రం ఎప్పుడూ పవర్ స్టార్ మీద ఏదో ఒక సెటైర్ వేస్తూనే ఉంటాడు. గతం లో ఇలాగే పవన్ ని కెలికి అభిమానులతొ గొడవపడ్డ వర్మ ట్విటర్ నుంచి బయటికి వచ్చాక ఫేస్బుక్ లో కూడా పవన్ ని వదలటం లేదు. ఇప్పుడు తాజా గా పవన్ తన చిన్న కొడుక్కి పెట్టిన పేరు మీద ఇంకో సెటైర్ వేసాడు...

    Recommended Video

    పనిలేక పోస్ట్‌లు పెడుతున్నావ్ అంటూ...వర్మ కూతురు ఫైర్..

    పవన్ కళ్యాణ్ చిన్న కొడుక్కు పేరు పెట్టాడు: చిరంజీవి పేరుకూడా కలిసేలా..పవన్ కళ్యాణ్ చిన్న కొడుక్కు పేరు పెట్టాడు: చిరంజీవి పేరుకూడా కలిసేలా..

     సర్వత్రా ఆసక్తి రేపింది

    సర్వత్రా ఆసక్తి రేపింది

    పవన్ కొడుకు పేరు ఏంటన్న దానిపై సర్వత్రా ఆసక్తి రేపింది. పవన్ కళ్యాణ్ హిందూ, ఆయన భార్య అన్నా లెజెనివా క్రిస్టియన్ కావడంతో వారికి పుట్టిన బిడ్డకు ఏ సాంప్రదాయం ప్రకారం పేరు పెడతారో అంటూ రకరకాలుగా చర్చించుకున్నారు.

     మార్క్ శంకర్ పవనోవిచ్

    మార్క్ శంకర్ పవనోవిచ్

    మొత్తానికి పవన్ అటు రష్యన్, ఇటు ఇండియన్ సాంప్రాదాల కలయికగా "మార్క్ శంకర్ పవనోవిచ్" అనే పేరు పెట్టాడు. చిరంజీవి అసలు పేరైన శివశంకర వరప్రసాద్ లోని శంకర్ నీ, తనపేరులోని పవన్ నీ కలిపి పవన్ పెట్టుకున్న పేరు రామ్‌గోపాల్ వర్మకి మాత్రం వెటకారంగా కనిపించిందట.

     ఇప్పటివరకూ వినని పేరును ఇప్పుడు విన్నాను

    ఇప్పటివరకూ వినని పేరును ఇప్పుడు విన్నాను

    ఈ ప్రపంచంలో క్రైస్తవం పుట్టక ముందు నుంచి, అసలు మానవులు మాట్లాడుకోగలరా? అని ఈజిప్టుకు చెందిన పారా సమెథికస్-1 పరిశోధనలు చేసిన కాలం నుంచి వెతికినా, ఇప్పటివరకూ వినని పేరును తానిప్పుడు విన్నానని రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు.

    పవనోవిచ్ మీద కూడా

    పవనోవిచ్ మీద కూడా

    ఈ పేరు అతి గొప్పదని వర్మ తన ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టాడు. భాషలు పుట్టిన తరువాత తాను విన్న పేర్లలో అత్యంత గొప్పది ఇదేనని చెప్పాడు. ఇలా పవన్ కళ్యాణ్‌నే కాదు ఇక పవనోవిచ్ మీద కూడా యుద్దం మొదలు పెట్టాడు వర్మ...

    English summary
    I find the integration of the individualism of Pawanism so very disintegrating but so very illustriously into a Russian owich and also as a Mark of homage to the primary Pawan originator Shanker
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X