'జీఎస్‌టీ'కి పోటెత్తుతున్న ట్రాఫిక్: నేడే విడుదల, ఆ కామెంట్‌తో మరో వివాదంలో వర్మ..

Recommended Video

'జీఎస్‌టీ'కి పోటెత్తుతున్న ట్రాఫిక్.. మరో వివాదంలో వర్మ..!

రాంగోపాల్ వర్మ.. సినిమానే కాదు ఆయన మాట కూడా వివాదమే. మెచ్చేవాళ్లు ఆయన్ను ఆకాశానికెత్తేస్తారు. గిట్టనివాళ్లు రోడ్ల మీద దిష్టిబొమ్మల్ని చేసి తగలబెడుతారు. అభిమానము, ద్వేషమూ.. ఈ రెండూ తనకు పట్టవు. తన పని తనకు నచ్చింది చేయడమే. ఇప్పుడూ అదే చేస్తున్నాడు. వివాదాల నడుమనే 'జీఎస్‌టీ' విడుదలకు సిద్దమైపోయాడు.

నిన్ననే విడుదల కావాల్సి ఉన్నా..:

నిజానికి 'జీఎస్‌టీ'(గాడ్,సెక్స్&ట్రూత్) నిన్ననే విడుదల కావాల్సి ఉన్నా.. విపరీతమైన ట్రాఫిక్ కారణంగా సైట్ క్రాష్ అయింది. శుక్రవారం ఉదయం 9గం. సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గాడ్,సెక్స్&ట్రూత్ సైట్ పైనే ఉండటంతో.. ఆ ట్రాఫిక్‌ను తట్టుకోలేక సైట్ ఓపెన్ అవలేదు.

నేడే విడుదల..:

గాడ్,సెక్స్&ట్రూత్ కు ఇంతటి అనూహ్య స్పందన రావడంతో వర్మ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని 'జీఎస్‌టీ' ప్రొడ్యూసర్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ను పరిష్కరించి సైట్‌ను అప్‌గ్రేడ్ చేశారని, జనవరి 27వ తేదీ ఉదయం 9గం.కు దీన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. సినిమా వాయిదా పడ్డందుకు చింతిస్తున్నట్లు తెలిపారు.

'సత్యమియా జయతే':

ట్విట్టర్‌లో మరో కామెంట్ కూడా చేశారు వర్మ. 'జీఎస్‌టీ'కి వస్తున్న ట్రాఫిక్ ను చూసి.. ఇండియాలో చాలామంది దీపికా పదుకొణే కంటే మియా మాల్కోవాను చూడటానికే ఎక్కువ ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. అంతేకాదు, 'సత్యమేవా జయతే'ను కాస్త 'సత్యమియా జయతే'గా మార్చేశాడు. వర్మ చేసిన ఈ కామెంట్‌తో ఇప్పుడు మరో వివాదం మొదలైంది.

 కామెంట్స్‌పై వివాదం:

కామెంట్స్‌పై వివాదం:

పద్మావత్, 'జీఎస్‌టీ' రెండూ ఒకేసారి విడుదల చేస్తుండటంతో.. దీపికాను, మియాను పోల్చి కామెంట్ చేయడంలో తప్పులేదు కానీ.. మధ్యలో 'సత్యమియా జయతే' అంటూ కామెంట్ చేయాల్సిన అవసరమేంటి?.. ఇది కేవలం వర్మ పైత్యం మాత్రమే అంటూ కొంతమంది నెటిజెన్స్ మండిపడుతున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం జాతీయ చిహ్నంలోని వ్యాఖ్యలకు వక్రభాష్యం చెప్పడం సరికాదంటున్నారు.

క్యురియాసిటీ పెంచేస్తున్నాడు:

క్యురియాసిటీ పెంచేస్తున్నాడు:

'జీఎస్‌టీ' వాయిదా పడ్డప్పటకీ.. దాని మీద మరింత క్యురియాసిటీని పెంచడంలో వర్మ సక్సెస్ అవుతూనే ఉన్నాడు. మియా హాట్ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ నెటిజెన్స్ ఎటెన్షన్ మిస్ అవకుండా జాగ్రత్తపడుతున్నాడు. ఇక ఆ ఫోటోలు ఎంత బోల్డుగా ఉన్నాయో మాటల్లో చెప్పడం కష్టమే.

 టికెట్ పెట్టినా.. లెక్క చేయట్లేదు:

టికెట్ పెట్టినా.. లెక్క చేయట్లేదు:

'జీఎస్‌టీ'కి రూ.150టికెట్ పెట్టినా సరే, చాలామంది దాన్ని పెద్దగా లెక్క చేయట్లేదు. వర్మ ఏం తీసి ఉంటాడు... ఎలా తీసి ఉంటాడన్న క్యురియాసిటీ టికెట్ రేటును పట్టించుకోకుండా చేస్తోంది. ఏదేమైనా ఒక పోర్న్ సినిమాకు కూడా ఇంతలా కలెక్షన్స్ తీసుకురావచ్చా? అన్న విషయాన్ని వర్మ 'జీఎస్‌టీ' ద్వారా నిరూపించబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X