వర్మ పెద్ద ఫిట్టింగే పెట్టాడు; 'మియా'లో మునుపెన్నడూ చూడని యాంగిల్స్?, మోడీనీ లాగి..

Recommended Video

వర్మ పెద్ద ఫిట్టింగే పెట్టాడు.. మియా నా ? మోదీ నా ?

జనవరి 26.. సాధారణంగా అయితే గణతంత్ర దినోత్సవ వేడుకల పైనే అందరి చూపు. కానీ దర్శకుడు రాంగోపాల్ వర్మ 'గాడ్ సెక్స్&ట్రూత్'తో చాలామంది ఎటెన్షన్‌ను అటువైపు మళ్లించాడు. నేటి ఉదయం 9గం.కు ఈ సినిమా విడుదల కాబోతుండటంతో.. చాలామంది 'జీఎస్‌టీ' సైట్‌పై ఆన్‌లైన్‌లో రెడీగా ఉన్నారు. అయితే అనుకున్నట్లుగానే వర్మ పెద్ద ఫిట్టింగ్ పెట్టేశాడు. ఆన్‌లైన్‌లో ఈ సినిమాను వీక్షించాలంటే రూ.150 చెల్లించాల్సిందే..

పెద్ద ఫిట్టింగే..:

అందరిలా చేస్తే తను వర్మ ఎందుకవుతాడు?.. అందుకే తీరా విడుదల సమయానికి 'షరతులు వర్తిస్తాయి' అన్న ఫిట్టింగ్ పెట్టేశాడు. ఆన్ లైన్ చార్జీ చెల్లిస్తేనే 'జీఎస్‌టీ' చూసే అవకాశం అని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. సినిమాను నిర్మించిన యూఎస్ ప్రొడక్షన్ హౌజ్ ఈ చార్జీలను నిర్ణయించిందని.. చూడాలనుకునేవాళ్లు ట్విట్టర్ లో తాను పెట్టిన సైట్ లోకి వెళ్లి చూడవచ్చని తెలిపాడు.

ఆత్రుతగా ఉందట..:

ఇంతవరకు తాను చేసిన ఏ సినిమా కోసం ఇంత ఆత్రుతగా ఎదురుచూడలేదని రాంగోపాల్ వర్మ అంటున్నారు. నేటి ఉదయం 9గం.కు సినిమా విడుదల కాబోతుండటంతో.. ఎగ్జయిట్‌మెంట్ తట్టుకోలేకపోతున్నానని ట్విట్టర్‌లో తెలిపారు.

మోడీ 'జీఎస్‌టీ' కంటే మాల్కోవానే ముందు..:

'గాడ్,సెక్స్&ట్రూత్'కు మీడియా 'జీఎస్‌టీ' అనే షార్ట్ ఫామ్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దీని ఆధారంగా వర్మ తన ట్విట్టర్ ద్వారా ఒక పోల్ కూడా నిర్వహించారు.

నరేంద్ర మోడీ 'జీఎస్‌టీ'(గూడ్స్ సర్వీస్ టాక్స్), ఎక్కువ పాపులరా?.. లేక మియా మాల్కోవా 'జీఎస్‌టీ' (గాడ్,సెక్స్&ట్రూత్) ఎక్కువ పాపులరా? అన్న ప్రశ్రకు మియాకే ఎక్కువ మార్కులు పడటం గమనార్హం. మోడీ 'జీఎస్‌టీ'కి 33శాతం మంది ఓట్ చేస్తే... 67శాతం మంది మియాకే ఓట్ చేశారు. మొత్తం 35,522మంది ఓటింగ్ లో పాల్గొన్నట్లు తెలిపారు.

ఇదే నా ఉద్దేశం:

'జీఎస్‌టీ'ని తెరకెక్కించడంలో తన ఉద్దేశమేంటో మరోసారి ట్వీట్ ద్వారా వెల్లడించారు వర్మ. మియా మాల్కోవా నగ్నత్వాన్ని అత్యంత పవిత్రంగా చూపించానని, తన శరీరంలోని ప్రతీ పార్ట్‌కు ఈస్తటిక్ జస్టిస్ చేయగలిగానని వెల్లడించారు. అలాగే ఎంఎం కీరవాణి అందించిన ఆధ్యాత్మిక సంగీతానికి తగ్గట్లుగా చిత్రాన్ని మలిచినట్లు చెప్పారు.

మునుపెన్నడూ చూడని యాంగిల్స్..:

మియా మాల్కోవాను మునుపెన్నుడూ.. ఎవరూ చూపించని కెమెరా యాంగిల్స్ లో తాను చూపించబోతున్నట్లు వర్మ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని 'రిగ్స్'(కెమెరా వర్క్ కోసం) తయారుచేసినట్లు చెప్పారు.

 రివ్యూల మోత పక్కా:

రివ్యూల మోత పక్కా:

విడుదలయ్యి కాగానే.. దీనిపై రివ్యూల మోత మోగిపోవడం కూడా ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ దొరకడంతో 'జీఎస్‌టీ' బాగా పాపులర్ అయిపోయింది. అందరి ఆసక్తి ఒక్కటే.. వర్మ దీన్ని పోర్న్ గానే మలిచాడా?.. లేక నిజంగానే ఆధ్యాత్మిక ఫిలాసఫీని జోడించాడా?.. మరికొద్ది సేపట్లో దీనికి సమాధానం దొరకనుంది.

 వర్మ.. అదే నిరూపించబోతున్నాడు:

వర్మ.. అదే నిరూపించబోతున్నాడు:

మొత్తానికి 'జీఎస్‌టీ'తో ఒక పోర్న్ టైప్ చిత్రానికి కూడా ఫుల్లుగా కలెక్షన్స్ రాబట్టవచ్చని నిరూపించబోతున్నాడు వర్మ. థియేటర్ల అవసరం.. ఇతరత్రా హంగామా ఏమి లేకుండా.. సింపుల్‌గా డబ్బు రాబట్టే ప్రయత్నానికి నాంది పలికాడు.

ఇంతకుముందు ఇదే ప్రయత్నం వేరేవాళ్లు చేసినప్పటికీ.. వర్మ టచ్ తో ఇప్పుడు దీనికి పాపులారిటీ పెరిగిపోయింది. భవిష్యత్తులో చాలామంది ఫిలిం మేకర్స్ తమ సినిమాను డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో విడుదల చేసి చార్జీల ద్వారా వసూళ్లు రాబట్టుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X