అఖిల్‌తో ఆర్జీవీ సినిమానా.. అలాంటి కథ అంటూ వార్తలు!

అక్కినేని యువ హీరో అఖిల్ ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తొలి చిత్రం అఖిల్, రెండవ చిత్రం హలో ఆశించిన స్థాయి విజయాన్ని అందివ్వలేదు. ప్రస్తుతం అఖిల్ తొలిప్రేమ చిత్రంతో సత్తా చాటిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇదిలా ఉండగా అక్కినేని ఫ్యామిలీకి సన్నిహితుడు నాగార్జున కెరీర్ ని మార్చిన శివ చిత్రాన్ని అందించిన ఆర్జీవీ ఆసక్తికరమైన విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు.

హిట్టు కోసం ఎదురుచూపులు

హిట్టు కోసం ఎదురుచూపులు

అఖిల్ చిత్రంతో అక్కినేని వారసుడు అఖిల్ చిత్ర పరిశ్రమలోకి ఘనమైన ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ చిత్రం మెప్పించలేకపోయింది. హలో చిత్రంలో అఖిల్ నటనకు మంచి మార్కులు పడ్డా ఆ చిత్రం కూడా నిరాశపరిచింది.

యువతకు చేరువయ్యేందుకు

యువతకు చేరువయ్యేందుకు

తొలి రెండు చిత్రాలు నిరాశపరచడంతో అఖిల్ మూడో చిత్రంపై దృష్టిపెట్టాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఎలాగైనా ఈ చిత్రంతో హిట్ అందుకోవాలని అఖిల్ భావిస్తున్నాడు.

 ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ అఖిల్ తో సినిమా చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయని సంచలన ప్రకటన చేశాడు. కానీ అక్కినేని ఫ్యామిలీ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. రెండు మూడు నెలల్లో దీని గురించి క్లారిటీ వస్తుందని వర్మ అన్నాడు.

 కాలేజ్ స్టూడెంట్ కథ

కాలేజ్ స్టూడెంట్ కథ

అఖిల్, ఆర్జీవీ చిత్ర కథకు సంబంధించి కూడా ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. కాలేజీ స్టూడెంట్ కథని ఆర్జీవీ అఖిల్ కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అక్కినేని ఫ్యామిలీతో

అక్కినేని ఫ్యామిలీతో

శివ వంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ ని వర్మ నాగార్జునకు అందించాడు. ఆ తరువాత వీరి కాంబినేషన్ లో మరికొన్ని చిత్రాలు వచ్చాయి. తాజగా ఆఫీసర్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. నాగచైతన్య నటించిన బెజవాడ చిత్రానికి వర్మ నిర్మాత. ఈ దర్శకుడు అక్కేనేనికి ఫ్యామిలితో ఎప్పుడూ టచ్ లోనే ఉంటున్నాడు. వర్మ ఎంత క్రియేటివ్ డైరెక్టర్ అయినా ప్రస్తుతం అతడి నుంచి ఆకట్టుకునే చిత్రాలు రావడం లేదనే విమర్శ ఉంది.

నాగ్ నిర్ణయం

నాగ్ నిర్ణయం

టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న అఖిల్ ని వర్మ చేతిలో నాగ్ పెడతాడా అనే చర్చ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి అక్కినేని ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావలసి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X