రాంచరణ్ సినిమా గోల్డ్, డైమండ్స్ అంటూ ఒక రేంజ్‌లో.. వర్మ ప్రశంసలు విన్నారా!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన తాజా చిత్రం వినయ విధేయ రామ. రాంచరణ్, కైరా అద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం ఇది. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎప్పటిలానే అద్భుతమైన కమర్షియల్ అంశాలతో బోయపాటి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. రాంచరణ్ రంగస్థలం చిత్రం తర్వాత నటించిన చిత్రం కావడంతో వినయ విధేయ రామ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. నిన్ననే ఈ చిత్ర ఆడియో వేడుకలో థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ లో రాంచరణ్ కంప్లీట్ మాస్ లుక్ అలరిస్తోంది. తాజాగా వివాదాస్పద దర్శకుడు బోయపాటి వినయ విధేయ రామ ట్రైలర్ పై స్పందించాడు.

వావ్ అనిపించేలా
బోయపాటి రూపొందించిన ఈ చిత్రం వావ్ అనిపించేలా ఉందంటూ వర్మ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. విజయ విధేయ రామ ట్రైలర్ ని తన ట్విట్టర్ కథలో వర్మ షేర్ చేశాడు. గోల్డ్, డైమండ్స్ అంటూ వినయ విధేయరామ ట్రైలర్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేయాలి అని వర్మ కోరాడు. ఈ నేపథ్యంలో కెజిఫ్ చిత్రంతో పోల్చుతూ చేసినా ట్వీట్ వైరల్ అవుతోంది.

గోల్డ్, డైమండ్స్
వినయ విధేయ రామ ట్రైలర్ గోల్డ్ లాంటి కెజిఎఫ్ చిత్రాన్ని, డైమండ్స్ తో మిక్స్ చేసి ఉంది. కాబట్టి హిందీలో కూడా విడుదల చేయాలి అని తెలిపాడు. జంజీర్ చిత్రాన్ని పక్కన పెడితే రాంచరణ్ కు ఈ చిత్రం హిందీలో మెమొరబుల్ మూవీ అవుతుందని వర్మ పేర్కొన్నాడు. రాంచరణ్ లుక్ మైండ్ బ్లోయింగ్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు.
వరుసగా వివాదాలు
ఎప్పుడూ వివాదాలు సృష్టించే వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యమే. వర్మ ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా రూపొందుతున్న ఈ చిత్రం వివాదాలతో సంచలనంగా మారింది. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మి పార్వతి ఎలా ప్రవేశించింది.. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి లాంటిఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు వర్మ సిద్ధం అవుతున్నాడు.

కేసులు నమోదు
లక్ష్మీస్ ఎన్టీఆర్ నేపథ్యంలో వర్మపై పలు కేసులు కూడా నమోదవుతున్నాయి. అయినా కూడా వర్మ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అనూహ్య పరిణామాలని లోతుగా అధ్యయనం చేసిన తరువాతే ఈ చిత్రాన్ని ప్రారంభించానని వర్మ చెబుతున్నాడు. లక్ష్మి పార్వతి ఈ చిత్రానికి మద్దత్తు తెలుపుతుండగా.. టిడిపి నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.


Click it and Unblock the Notifications











