ఆర్జీవి జర్నీ-2017: వివాదాల్ని వీడలేదు.., వెబ్ సిరీస్‌లతో రెచ్చిపోతున్నాడు..
వివాదం తన ట్యాగ్ లైన్ అన్నట్లు వ్యవహరించే రాంగోపాల్ వర్మ 2017లోను అదే పంథాను కొనసాగిస్తూ వస్తున్నారు. తనకు నచ్చింది మాట్లాడేయడం.. నచ్చిన సబ్జెక్టుపై సినిమా తీసేయడం ఆయన స్టైల్. ఇందులో ఔట్ సైడర్స్ సలహాలు, సూచనలకు ఏమాత్రం తావు లేదు.
Recommended Video

ఈ నేపథ్యంలో గతంలో మాదిరే ఈ ఏడాది కూడా వర్మ చాలా సినిమాలే ప్రకటించాడు. అందులో ఎన్నింటిని తెరకెక్కిస్తాడో.. ఎన్నింటిని అటకెక్కిస్తాడో ఆయనకు తప్ప ఇంకెవరికీ తెలియవు.
ఈ ఏడాది వర్మ నుంచి సర్కార్-3 సినిమా మాత్రమే వచ్చింది. అది గాక
గన్స్&థైస్, మేరీ బేటీ సన్నీ లియోన్ బన్నా చాహ్తీ హై వంటి షార్ట్ ఫిలింస్ వచ్చాయి. గన్స్&థైస్‌లో బోల్డ్ నెస్‌తో జనాలను నోరెళ్లబెట్టేలా చేసిన వర్మ.. మేరీ బేటీ సినిమాతో ఆలోచన రేకెత్తించే కాన్సెప్టును తెరకెక్కించారు.

ఇదే ఏడాది లక్ష్మీస్ ఎన్టీఆర్, నూక్లియర్ లాంటి సినిమాలు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అదే సమయంలో ఫ్యాక్షన్ నేపత్యంలో కడప అనే వెబ్ సిరీస్‌ను ఇప్పటికే మొదలుపెట్టారు. వర్మ చేస్తున్న ప్రాజెక్టుల కన్నా.. ఆయన గతంలో ప్రకటించి పెండింగ్ లోనే ఉండిపోయిన ప్రాజెక్టులు ఎక్కువగా ఉన్నాయి.
నయీం, కేసీఆర్ బయోపిక్, జయలలిత బయోపిక్, ఇలా చాలానే ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయి. వర్మ ఏదో కాకతాళీయంగా వీటిని ప్రకటించారా?.. లేక సీరియస్ గానే తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారా? అన్నది ఇప్పటికైతే క్లారిటీ రాలేదు.
ఇక ఇదే ఏడాది నాగార్జునతో వర్మ సినిమా కూడా మొదలుకావడం విశేషం. శివ తర్వాత ఈ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా ఇదే కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే వర్మ తిరిగి మళ్లీ ట్రాక్ ఎక్కుతాడా?.. లేక్ నాగార్జునతోనూ రొటీన్ ఫార్ములాతో సినిమా చేస్తాడా? అన్నది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











