'రక్త చరిత్ర' పై వర్మ వివరణ
యథార్థ వ్యక్తుల యథార్థ సంఘటనలతో ప్రభావితమైన ఒక కల్పిత గాధగా రక్త చరిత్ర చిత్రాన్ని రూపొందించనున్నట్లు రామ్‌గోపాల్‌వర్మ చెప్పారు.షూటింగ్ ఈరోజు(సోమవారం) నుండి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా వివరాలను తెలుపడానికి రామ్‌గోపాల్‌వర్మ హైదరాబాద్‌లో మిడియా సమావేశం ఏర్పాటు చేశారు. వర్మ మాట్లాడుతూ -"ఈ సినిమా అనుకున్ననాటి నుంచీ ఎన్నో సందేహాలు, సంశయాలు ప్రజల్లో ఉన్నాయి. వాటికి వివరణ ఇవ్వాల్సి బాధ్యత నాపై ఉంది. 'రక్తచరిత్ర' సినిమా విషయానికొస్తే ఇది యథార్థ వ్యక్తుల కల్పిత కథ. ఈ నేపథ్యంలో సినిమా చేయాలనుకున్నప్ప ట్నుంచీ రాయలసీమకు సంబంధించిన ఎందరో వ్యక్తుల్ని కలిశాను. రెండు వర్గాలుగా చలామణీ అవుతున్న వారి వద్ద నుంచి ఎన్నో విషయాలను తెలుసుకున్నాను.
వారు చెప్పేది వారి వైపునుంచి ఆలోచిస్తే కరెక్ట్‌గా ఉంటుంది. ఇవతలివైపు నుంచి ఆలోచిస్తే తప్పు అనిపిస్తుంది. ఈ కథనాల్లో కథకు ఉపకరించే విషయాలను మాత్రమే తీసుకొని 'రక్తచరిత్ర'ను తయారు చేశాను. ఇప్పటి వరకూ నేను ఏ కథలో వినని, కనని భావోద్వేగాలు ఇందులో ఉన్నాయి. అందుకే దీన్ని ప్రేక్షకులకు అందించాలని ఈ సినిమా చేస్తున్నాను. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రతి సన్నివేశం రియలిస్టిక్‌గా ఉంటుంది. ఇలానే జరిగి ఉంటుందేమో.... అనిపించే విధంగా సన్నివేశాలు ఉంటాయి. హైదరాబాద్, అనంతపురం ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. వివేక్ ఒబెరాయ్, సూర్య ఇందులో ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
మిగిలిన వారి వివరాలు త్వరలో చెబుతా' అన్నారు.అనంతరం "రక్త సిక్త వర్ణమైన... తరతరాల చరిత్ర' అనే పల్లవితో సాగే ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను మీడియా వారికి వినిపించారు. అలాగే రక్తచరిత్ర-1 తోపాటు రక్తచరిత్ర-2 కూడా చేయబోతున్నట్లు వర్మ తెలిపారు. రెండు షూటింగ్‌లు సమాంతరంగా జరుగుతాయని, రక్తచరిత్ర-1 విడుదలైన రెండు వారాల తర్వాత రక్తచరిత్ర-2 కూడా విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో రామ్‌గోపాల్‌వర్మతో పాటు చిత్ర నిర్మాతలు మధు మంతెన, షీతల్ వినోద్ తల్వార్ కూడా పాల్గొన్నారు. ఇక ఇందులో ఎవ్వరినీ హీరోగానో.. విలన్ గానేోచూపించలేదు. అప్పటి పరిస్థితులే ముఖ్యం. తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల్లో తీస్తున్నాం. వివేక్, సూర్యలు మూడు భాషల్లోనూ కనిపిస్తారు. ఎన్టీఆర్ పాత్రలో మోహన్‌బాబు నటిస్తారు. అయితే సాంకేతిక నిపుణులు ఇతర తారాగణాన్ని ఇంకా ఖరారు చేయలేద''న్నారు.


Click it and Unblock the Notifications











