twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాడో దొంగ.. ఆఫీసు నుంచి గెంటేశాం, ఇన్నాళ్లు ఎందుకు సైలెంట్‌గా ఉన్నానంటే: జయకుమార్‌పై ఆర్జీవి

    |

    Recommended Video

    వాడో దొంగ.. ఆఫీసు నుంచి గెంటేశాం.. జయకుమార్‌పై ఆర్జీవి..!

    రాంగోపాల్ వర్మపై కాపీ ఆరోపణలంటే ఒకింత ఆశ్చర్యమే. ఎందుకంటే.. కాపీ చేస్తే తానే స్వయంగా చెప్పుకుంటాడు కాబట్టి. స్ఫూర్తి పొందాను లాంటి కవరింగ్ మాటలు కూడా చెప్పడు. కాపీ కొట్టేశానని సూటిగానే చెప్పగలడు.అలాంటి వర్మపై జయకుమార్ అనే రచయిత కాపీ ఆరోపణలు చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే జయకుమార్ ఆరోపిస్తున్నట్లు వర్మ నిజంగానే అతని కంటెంట్ కాపీ కొట్టాడా?.. నిజానిజాల సంగతేమో గానీ వర్మ మాత్రం ఘాటుగానే బదులిచ్చాడు..

    వర్మపై జయకుమార్ కక్ష?: 'జోకర్'తో బదులు తీర్చుకుంటాడట!..వర్మపై జయకుమార్ కక్ష?: 'జోకర్'తో బదులు తీర్చుకుంటాడట!..

    వర్మ మాటల్లో..:

    వర్మ మాటల్లో..:

    ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నించే ఎందరో కొత్త వాళ్లను నేను ఎంకరేజ్ చేస్తుంటాను. అందులో కొందరితో మాట్లాడుతుంటాను. కొందరితో మెయిల్ లో కాంటాక్ట్ చేస్తాను. అలా నాకు ఏడాది క్రితం పరిచయమైన వాడే ఈ జయకుమార్.

    వర్మ పెద్ద ఫిట్టింగే పెట్టాడు; 'మియా'లో మునుపెన్నడూ చూడని యాంగిల్స్?, మోడీనీ లాగి.. వర్మ పెద్ద ఫిట్టింగే పెట్టాడు; 'మియా'లో మునుపెన్నడూ చూడని యాంగిల్స్?, మోడీనీ లాగి..

    ఎన్ని ఛాన్స్‌లు ఇచ్చినా..:

    ఎన్ని ఛాన్స్‌లు ఇచ్చినా..:

    నా దగ్గర పనిచేసిన కాలంలో ఏనాడూ అతడి పనితీరు మెప్పించేలా లేదు. తనను తాను నిరూపించుకోక పోతాడా అని చాలా ఛాన్సులిచ్చా. కానీ ఏదీ ఉపయోగించుకోలేదు.

    జెంట్స్,సెక్స్&ట్రూత్: మియాకు పోటీగా మేల్ పాలకోవా?.. ఏంటీ కొత్త జీఎస్‌టీ?జెంట్స్,సెక్స్&ట్రూత్: మియాకు పోటీగా మేల్ పాలకోవా?.. ఏంటీ కొత్త జీఎస్‌టీ?

     అతన్ని గెంటేశాం..:

    అతన్ని గెంటేశాం..:

    ఆఖరికి నా ఆఫీసులో కొన్నిసార్లు దొంగతనం చేస్తూ కూడా పట్టుబడ్డాడు. దీంతో 10నెలల క్రితమే నా టీమ్ నుంచి జయకుమార్‌ను బయటకు గెంటేశాం. వాడో దొంగ.

    జీఎస్‌టీ-గాడ్ సెక్స్&ట్రూత్

    జీఎస్‌టీ-గాడ్ సెక్స్&ట్రూత్

    మూడు నెలల క్రితమే జీఎస్‌టీ ఆలోచన రూపుదిద్దుకుంది. అప్పుడే షూట్ పనులు మొదలుపెట్టాం. ఈ మూడు నెలల కాలంలో దీనికోసం 15 మంది రకరకాల హోదాల్లో పని చేశారు. జయకుమార్ ను బయటకు పంపి పది నెలలు దాటుతోంది.

     అందుకే ఇన్నాళ్ల మౌనం:

    అందుకే ఇన్నాళ్ల మౌనం:

    ఇప్పుడు జీఎస్‌టీ తనదేనంటూ ఆరోపిస్తున్న జయకుమార్.. ఆ కంటెంట్ మా కంప్యూటర్ నుంచో హ్యాక్ చేయడమో.. లేక దొంగతనం చేయడమో చేసి ఉంటాడు. అలాంటి క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాడికి అనవసరంగా పబ్లిసిటీ కల్పించడం ఎందుకనే ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నాను.

     క్రిమినల్ ప్రొసీడింగ్స్:

    క్రిమినల్ ప్రొసీడింగ్స్:

    జయకుమార్ పై ఇప్పుడు సివిల్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకుంటున్నాం. ఇప్పటికే సైబర్ క్రైమ్ డివిజన్ కు అతని నేరప్రవృత్తి గురించి ఫిర్యాదు చేశాం.

    దుమ్మురేపుతున్న జీఎస్‌టీ సెర్చింజన్ ట్రెండ్స్:

    వివాదం సంగతి పక్కనపెడితే.. వర్మ జీఎస్‌టీకి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న స్పందన అంతా ఇంతా కాదు. గడిచిన నాలుగు గంటల్లో జీఎస్‌టీ పట్ల ఎంతమంది ఆసక్తి కనబరిచారో చెప్పేలా.. సెర్చింజన్ ట్రెండ్స్ ను ట్విట్టర్ లో పోస్టు చేశారు వర్మ. ఉదయం 9గం. సమయంలో జీఎస్‌టీకి విపరీతమైన ట్రాఫిక్ పోటెత్తినట్లు అందులో కనిపిస్తోంది.

    English summary
    Ramgopal Varma fired on Jayakumar who alleged that varma was copied my content for GST. RGV said Jayakumar was a thief, and theft his content from his office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X