వర్మ మరో కాంట్రవర్సీ.. శ్రీదేవి బాహుబలిలో నటించకపోవడానికి కారణం అతడే!
శ్రీదేవి మరణం సినీ ప్రపంచానికే పెద్ద షాక్. ఎవ్వరూ ఊహించలేని విధంగా శ్రీదేవి అకస్మాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. ఇండియా లోని అని చిత్ర పరిశ్రమల్లో జయకేతనం ఎగురవేసిన నటి శ్రీదేవి. అందంలో అతిలోక సుందరి అయిన శ్రీదేవి, నటనతో అద్భుతాలు చేసింది. శ్రీదేవి వ్యక్తిగత విషయాన్ని పక్కనపెడితే ఆమె వివాదాల్లో పెద్దగా కనిపించరు. ముగిసిపోయిన వివాదాన్ని మరో మారు రేపే విధంగా ఓ ఇంటర్వ్యూలో వర్మ బాహుబలి చిత్రంలో శ్రీదేవి ఎందుకు నటించలేదో వివరించాడు.శ్రీదేవి భర్త బోనికపూర్ వలనే శ్రీదేవి బాహుబలి చిత్రంలో నటించే అవకాశాన్ని కోల్పోయిందని వర్మ తెలిపాడు.

శ్రీదేవి వీరాభిమాని
శ్రీదేవి వీరాభిమానుల్లో రాంగోపాల్ వర్మ ముందు వరుసలో ఉంటారు. శ్రీదేవి అంటే చచ్చిపోయే సెలెబ్రెటీల్లో వర్మ ఒకరు. శ్రీదేవి మరణం తరువాత వర్మ ట్విట్టర్ వేదికగా తన ఆవేదనని వర్మ వెల్లడించిన సంగతి తెలిసిందే.

హుందా తనాన్ని చాటుకున్న శ్రీదేవి
శివగామి పాత్ర కోసం రాజమౌళి మొదట శ్రీదేవిని సంప్రదించారు. అధిక మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో రమ్యకృష్ణని ఎంపికచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రాజమౌళి బయటకు వెల్లడించడంతో వివాదంగా మారింది. దీనిపై శ్రీదేవి స్పందించిన తీరు ఆమె హుందా తనానికి నిదర్శనం. రాజమౌళి బాహుబలి లాంటి విజయవంతమైన చిత్రాలు ఇంకా చాలా చేయాలనీ శ్రీదేవి శుభాకాంక్షలు తెలియజేసింది. అక్కడితో ఈ వివాదం ముగిసింది.

కారణం వివరించిన వర్మ
ముగిసిపోయిన వివాదాన్ని మరో మారు రేపే విధంగా ఓ ఇంటర్వ్యూలో వర్మ బాహుబలి చిత్రంలో శ్రీదేవి ఎందుకు నటించలేదో వివరించాడు.శ్రీదేవి భర్త బోనికపూర్ వలనే శ్రీదేవి బాహుబలి చిత్రంలో నటించే అవకాశాన్ని కోల్పోయిందని వర్మ తెలిపాడు.

శ్రీదేవి నటించాలనుకుంది
బాహుబలి చిత్రంలో నటించే అవకాశం శ్రీదేవి వచ్చినపుడు తాను ఆమెతో మాట్లాడానని వర్మ అన్నారు. గొప్ప చిత్రంలో నటించే అవకాశం వదులుకోవద్దని సలహా ఇచ్చానని వర్మ అన్నారు. శ్రీదేవికి కూడా ఈ చిత్రంలో నటించాలని ఉండేదని అన్నారు. కానీ బోనికపూర్ కు మాత్రం ఇష్టం లేదని వర్మ అన్నారు.

శ్రీదేవి చాలా నష్టపోయింది
బోనికపూర్ కు ఇష్టం లేకపోవడం వలనే అధిక మొత్తంలో పారితోషకం డిమాండ్ చేయడం రాజమౌళి వెనక్కు తగ్గడం జరిగిందని వర్మ అన్నారు. బోనికపూర్ నిర్ణయాల వలన శ్రీదేవి కెరీర్ పరంగా చాలా నష్టపోవలసి వచ్చిందని కూడా రాంగోపాల్ వర్మ ఆరోపించారు.


Click it and Unblock the Notifications











