రామ్ గోపాల్ వర్మ ‘సైకో’రిలీజ్ డేట్ ఫిక్స్(పోస్టర్)
హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ తాజాగా 'సైకో' అనే చిత్రంతో సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈ నెల 21 న విడుదల చేయటానికి ప్లాన్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒక అమ్మాయి చూడవలసిన చిత్రం అని,అమ్మాయిలను వేధించే ఒకడి యధార్ధ కథ ఆధారంగా...అని పోస్టర్ పై వేసారు.
'సైకో' టైటిల్‌తో తానే స్వయంగా కథ రాసుకున్న రామ్ గోపాల్ వర్మ...ఈ చిత్రం ద్వారా కిషోర్ భార్గవ్ అనే వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు. మగవారి మూలంగా సమస్యలు ఎదుర్కొంటున్న మహిళల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోంది. కాలిబెర్ ఫిల్మ్ సంస్థ వారు 'సైకో' సినిమాను నిర్మింస్తున్నారు.

మహిళ జీవితం ఎంతో సున్నితమైనది, వారి జీవితంలో ఒక మగాడు ప్రవేశించిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది ఈ సినిమాలో చూపెట్టబోతున్నాం' అన్నారు. ప్రస్తుతం నిర్మాత దశలో ఉన్న ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. వర్మ మార్కు సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఇప్పటి సమాజంలోని పోకడలను ఫోకస్ చేస్తూ ఈ సినిమా ఉంటుంది.


Click it and Unblock the Notifications











