ముంబై దాడుల విషయమై మాట తప్పిన వర్మ
ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ఎరోస్ ఇంటర్‌నేషనల్ వరల్డ్ వైల్డ్ రిలీజ్ తరపున నిర్మించే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందన్నాడు. త్వరలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామన్నాడు. ఈ చిత్రంలో 26/11 దాడుల ఘటనకు సంబంధించిన అన్ని సన్నివేశాలను చక్కగా తీశామన్నాడు. సినిమాలోని మొదటి ఏడు నిముషాలను ట్రైలర్ గా కట్ చేసి ఆన్ లైన్ లో ఉంచారు.
సినిమా మొత్తం పూర్తిగా కొత్త వాళ్లతో మరియు నిజంగా ఆయా పాత్రలు, ఆ సంఘటనా సమయంలో మాట్లాడిన ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ మరియు మరాఠీ భాషల్లో షూట్ చేయబడుతుంది. అంతర్జాతీయంగా విడుదల చేయడమే లక్ష్యంగా గల ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 40 కోట్లు.
ఇందులో అమర్ సోలంకి నుంచి చేపలు పట్టే 'కుబేర్' అనే బోట్ స్వాధీనం చేసుకోవడం నుంచి, సిఎస్‌టి స్టేషన్ లో జరిగిన హత్యలు మరియు తాజ్ లో జరిగిన మారణకాండతో పాటు, కసబ్ ను హింసించే వరకూ అన్ని సన్నివేశాలు అత్యంత వివరంగా చూపబడతాయి. ఈ సినిమాలో అందరికంటే ప్రధానమైన నటుడు ఖచ్చితంగా కసన్ పాత్రను పోషించే అతను. కసబ్ లాంటి రూపంతో పాటు, సన్నివేశాల్లో ఉన్న సంక్లిష్టత, సంఘర్షణలను అద్భతుంగా కనబరచగల నటుడి కోసం వెతుకుతూ, సంజయ్ జైస్వాల్ అనే ఒక స్టేజ్(థియేటర్)ఆర్టిస్టును ఎంపిక చేశాను అని వర్మ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












