మహేష్ కత్తికి ప్రశంసలు.. 'అజ్ఞాతవాసి'కి చురకలు: 'పులి'తో పోల్చి వర్మ సెటైర్స్..
అభిమానుల అంచనాల్ని అమాంతం తీసుకెళ్లి పాతాళంలో పాతేశాడు త్రివిక్రమ్. పవన్ అంటే పడి చచ్చే అభిమానులు కూడా 'అజ్ఞాతవాసి' థియేటర్‌లో కూర్చోవడం ఇబ్బందిగా ఫీలవుతున్నారు. త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్‌పై ఉన్న అంచనాల్లో ఇసుమంత కూడా 'అజ్ఞాతవాసి' అందుకోలేదని తేల్చేశారు. సినిమా చూసిన పవన్ అభిమానులంతా తలలు పట్టుకున్న పరిస్థితి.
Recommended Video

ఇలాంటి తరుణంలో రాంగోపాల్ వర్మ నుంచి సెటైర్స్ పడటం.. నొప్పితో ఉన్నోన్ని మరింత గిల్లినట్లే అయింది. అదే సమయంలో మహేష్ కత్తిని ప్రశంసిస్తూ పోస్టు పెట్టడం పవన్ ఫ్యాన్స్‌కు మరింత మంట పుట్టించింది.
ఇలాంటి 'పులి'ని ఎప్పుడూ చూడలేదు:
ఇప్పుడే పులిని చూసొచ్చాను. ఇలాంటి పులిని మునుపెన్నడూ చూడలేదు. కోరలు, పంజా, లేని పులి.. ఎప్పటికప్పుడు చారలు మారిపోయే పులి. ఇంకా షాకింగ్ ఏంటంటే.. ఈ పులి జంపింగ్ పక్కనపెట్టి పాకుతోంది.
కత్తి అందగాడు..:
ఇప్పుడే మహేష్ కత్తి రివ్యూ వీడియో కూడా చూశాను. చాలా బాగుంది. దేవుడి మీద ఒట్టు వేసి చెబుతున్నా.. పవన్ కల్యాణ్ కంటే మహేష్ కత్తే అందంగా ఉన్నాడు.

హైపర్ ఆది సెటైర్:
వర్మ తనను ప్రశంసించడంతో మహేష్ కత్తి ఆర్జీవికి 'థ్యాంక్స్' చెప్పడం విశేషం. వీరి ట్వీట్స్ ఇలా సాగిపోతుంటే.. ఇంతలో హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు. ఇద్దరి ట్వీట్స్ పై సెటైర్ వేశాడు. 'అదిగో తెల్ల కాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లుంది వీరిద్దరిని చూస్తుంటే..' అని వ్యంగ్యాస్త్రం సంధించాడు.

ఆదికి బాగా నచ్చిందట..:
పవన్ కల్యాణ్ కోసం ఎంతకైనా సిద్దమనే అభిమానులు కూడా 'అజ్ఞాతవాసి'పై విముఖత వ్యక్తం చేయకుండా ఉండలేకపోతున్నారు. అలాంటిది హైపర్ ఆది మాత్రం ఈ సినిమాను పవన్ కోసం పదిసార్లు, త్రివిక్రమ్ కోసం మూడుసార్లు చూడవచ్చని చెప్పడం గమనార్హం.

ఫ్యాన్స్ గగ్గోలు:
సినిమాపై పడుతున్న సెటైర్స్ చూసి పవన్ ఫ్యాన్స్ నిట్టూరుస్తున్నారు. కొంతమంది బాహాటంగానే దర్శకుడు త్రివిక్రమ్ ను ఉతికారేస్తున్నారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా మారబోతున్న తరుణంలో.. త్రివిక్రమ్ ఇలాంటి డిజాస్టర్‌తో పవన్‌ను నిండా ముంచేశాడని విమర్శిస్తున్నారు.


Click it and Unblock the Notifications











