twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్‌పై గౌరవంతో తొలిసారి.. లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరపైకి.. మళ్ళీ కెలికిన ఆర్జీవీ!

    |

    ఆఫీసర్ చిత్ర పరాజయం తరువాత ఆర్జీవీ కొంత కాలం మౌనం వహించాడు. తాజాగా మళ్ళీ రాంగోపాల్ వర్మ వివాదాస్పద ప్రకటనతో తెరపైకి వచ్చాడు. మరుగున పడిపోయిందనుకున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు, ముహూర్తం కూడా కుదిరిందని రాంగోపాల్ వర్మ తాజాగా ప్రకటించాడు. వర్మ ప్రకటనతో ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో మరోమారు వివాదం చెలరేగినట్లు అయింది. వరుస ట్వీట్స్‌తో లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్రంపై వర్మ సంచలన ప్రకటన చేయడం ఆసక్తికాగా మారింది.

    ఛాన్స్ వచ్చినట్లే వచ్చి

    ఛాన్స్ వచ్చినట్లే వచ్చి

    నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రకటించిన తరువాత దర్శకుడిగా మొదట వినిపించిన పేరు వర్మదే. వర్మ దర్శకుడిగా ఖరారు అనుకున్న సమయంలో తేజ పేరు వినిపించింది. ఆ వెంటనే రాంగోపాల్ వర్మ తాను ఎన్టీఆర్ చరిత్రని లక్ష్మీస్ ఎన్టీఆర్ గా తెరకెక్కిస్తానని ప్రకటించడం వివాదంగా మారింది. ఆ తరువాత ఈ చిత్రం మరుగున పడిపోయింది.

    విజయదశమి రోజు

    తాజగా మళ్ళీ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై రాంగోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు. ఈ చిత్రాన్ని విజయదశమి రోజు తిరుపతిలో ప్రారంభించనున్నట్లు ప్రకటించాడు. వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం అంటూ విడుదల సమయం కూడా ప్రకటించేశాడు.

     హఠాత్తుగా వర్మ ప్రకటన

    హఠాత్తుగా వర్మ ప్రకటన

    ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు అక్టోబర్ 19న తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి వెల్లడిస్తామని వర్మ తెలిపాడు. హఠాత్తుగా వర్మ ప్రకటన చేయడంపై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌కు పోటీగానే వర్మ ఈ పని చేస్తున్నాడంటూ విమర్శలు మొదలయ్యాయి.

    వివాదాస్పద వ్యాఖ్యలు

    ఈ సందర్భంగా ఎన్టీఆర్ జీవితం గురించి వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. లక్ష్మి పార్వతి రావడానికంటే ముందే ఎన్టీఆర్ జీవితం ముగిసేది. లక్ష్మి పార్వతి వచ్చినప్పటి నుంచి నా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రారంభం అవుతుంది అని వర్మ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

     అందరికీ సర్‌ప్రైజ్

    అందరికీ సర్‌ప్రైజ్

    ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బాల గిరి చేతుల మీదుగా ఈ చిత్రం ప్రారంభం అవుతుందని వర్మ ప్రకటించాడు. ప్రారంభోత్సవం రోజు మీ అందరికి మరో సర్‌ప్రైజ్ కూడా ఉందని వర్మ ప్రకటించాడు. జివి ఫిలిమ్స్ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతుందని వర్మ తెలిపాడు.

    నా జీవితంలో ఎప్పుడూ చేయని పని

    నా జీవితంలో ఇంతవరకు ఏ సినిమాని ముహూర్తం చూసుకుని ప్రారంభించలేదు. తొలిసారి లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ముహూర్తం చూసుకుని ప్రారంభిస్తున్నా అని వర్మ తెలిపాడు. అది కూడా తిరుపతి వేంకటేశ్వరుడి పాదాల చెంత.. ఎన్టీఆర్ పై నాకున్న గౌరవం అది అని వర్మ తెలిపాడు. ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రారంభిస్తుండడంతో ఇంకెన్ని వివాదాలు చెలరేగుతాయో చూడాలి.

    English summary
    Ramgopal Varma Sensational announcement on Lakshmis NTR. Lahkshmis NTR will launch on Oct 19 in Tirupati
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X