మళ్ళీ ఏం బాంబు పేలుస్తావ్ సామీ..!? 5:30 కి సర్ప్రైజ్ అంటూ వర్మ ట్వీట్
ఈ రోజు సాయంత్రం 5:30 కి అందరికీ ఒక ఇబ్బంది కరమైన సర్ప్రైజ్ అంటూ రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ పెట్టటం ఇప్పుడు అందరి దృష్టీ వర్మ వైపే తిప్పింది.
ఆడే నోరూ తిరిగే కాలూ ఊరికే ఉండవంటారు ఈ సామెత మన రామ్‌గోపాల్ వర్మకి సరిగ్గా సరిపోతుంది. ఉన్నట్టు ఉండక ట్విటర్ తోనే దేశం మొత్తాన్నీ ఉడికిస్తూంటాడు వర్మ. ఒక దశలో అసలు వర్మ ఈ రాత్రి ఏ ట్వీట్ పెడతాడా అని మీడియా మొత్తం నిద్రలు మానుకొని రాత్రుల్లు వర్మ వాల్ చూడటమే పనిగా పెట్టుకున్నాయి అంటే అతిశయోక్తి కాదు..

ట్విటర్ లోనే ఓ గెస్ట్ హౌస్ ఉన్నట్టు
ట్విటర్ అంటేనే వర్మ అన్నట్టు మారిందిప్పుడు పరిస్థితి. అసలే ట్విటర్ లోనే ఓ గెస్ట్ హౌస్ ఉన్నట్టు సగం రోజంతా అక్కడే ఉండే వర్మ... ఇప్పుడు ఏకంగా అదే తన ఇళ్ళు అన్నట్టు తయారయ్యాడు. తాజాగా ఈ రోజు సాయంత్రం 5:30 కి అందరికీ ఒక ఇబ్బంది కరమైన సర్ప్రైజ్ అంటూ ట్వీట్ పెట్టటం తో ఇప్పుడు ఏం బాంబు పేలుస్తాడో అని దేశం మొత్తం మీద ఉన్న ట్విటర్ ఫాలోవర్లు పిచ్చెక్కి పోతున్నారు...

ఫేస్ బుక్ లో పోస్టులు
సర్కార్ 3 విడుదలయ్యాక మరీ పెద్ద కాంట్రవర్షియల్ ట్వీట్లేమీ చేయలేదు వర్మ. హమ్మయ్య అనుకున్నంతలో ఇప్పుడు ఏకంగా పెద్ద పంచ్ విసిరాడు. ఇంతకీ ఎవరిని ఈ సారి వేసుకుంటాడూ అన్న టాపిక్ తో ఇప్పటికే ఫేస్ బుక్ లో పోస్టులు మొదలైపోయాయ్. ఆ ట్వీట్ ని స్క్రీన్ షాట్ లు తీసి మరీ స్ప్రెడ్ చేస్తున్నారు.

బాలీవుడ్ సినిమా సచిన్
ఒక వేళ టాపిక్ సినిమా గురించి గనక అయితే ఈ రోజు వచ్చిన బాలీవుడ్ సినిమా సచిన్ మీదా, లేదంటే తాను తీసిన సర్కార్ గురించా అన్నది ఒక అనుమానం అయితే.. అప్పట్లో చెప్పిన హాలీవుడ్ సినిమా న్యూక్లియర్ గురించి ఏదైనా చెప్తాడా అన్న ఉత్కంట మాత్రం కనిపిస్తోంది.

ఎవరిమీద ఏ పిడుగు పడనుందో
ఇంతకీ ఎప్పుడూ రాత్రుల్లు మాత్రమే ట్వీట్లతో విరుచుకు పడే వర్మ ఈసారి మాత్రం సాయంత్రం ట్వీట్ పెడతాను అంటూ ముందే హెచ్చరిక గా ఇంకో ట్వీట్ పెట్టటం మరీ విచిత్రం. డైరెక్ట్ గా ఆ ట్వీట్వేదో అప్పుడే చెయ్యొచ్చు కదా... ఎటూ ఫాలోవర్లు మిస్సవుతారన్న భాద ఎటూలేదు. ఎందుకంటే ఎప్పుడేం బాబు పేలుస్తాడా అని ఎదురు చూస్తూనే ఉంటారు జనాలు... చూద్దాం మరి ఇంతకీ ఎవరిమీద ఏ పిడుగు పడనుందో...


Click it and Unblock the Notifications











