»   » టాలీవుడ్ లో ఆత్మహత్యలా..? ఏమిటీ మాటలు వర్మా..??

టాలీవుడ్ లో ఆత్మహత్యలా..? ఏమిటీ మాటలు వర్మా..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

గురువారం విడుదలైన 'బాహుబలి-2' ట్రైలర్‌ను విపరీతంగా ప్రశంసిన వర్మ, మరోసారి మెగాస్టార్‌, పవర్‌స్టార్‌, సూపర్‌స్టార్‌లను కించపరిచాడు. ప్రభాస్‌ కాలిగోటికి సరిపోవాలంటే వీరికి రెండున్నర జన్మలు పడుతుందని ఎద్దేవా చేశాడు. అలాగే మరిన్ని సంచలనాత్మక ట్వీట్లు చేశాడు.

నిన్న సాయంత్రం

నిన్న సాయంత్రం

నిన్న సాయంత్రం తన ట్వీట్లు మొదలు పెట్టిన వర్మ మొదట మెగా హీరోలనే టార్గెట్ చేసినట్టు అనిపించే ట్వీట్లతో స్టార్ట్ చేసాడు. ‘బాహుబలి-2' ట్రైలర్‌కి ప్రపంచమంతా జై కొడుతున్నా, టాలీవుడ్‌ మాత్రం సూపర్‌ సైలెంట్‌గా ఉండిపోయిందని, దానికి కారణం టాలీవుడ్‌.. కుళ్లు సముద్రంలో మునిగిపోవడమేనని విమర్శించాడు.

‘బాహుబలి-2' ట్రైలర్‌లో

‘బాహుబలి-2' ట్రైలర్‌లో

అలాగే ‘బాహుబలి-2' ట్రైలర్‌లో ప్రభాస్‌ చాలా అందంగా ఉన్నాడని, పదివేల మంది అమ్మాయిల కూడా ప్రభాస్‌ అందం ముందు దిగదుడుపేనని ప్రశంసించాడు. అయితే ఇప్పుడు ఈ ట్వీట్ లో టాలీవుడ్ అని పెట్టినా వర్మ ఉద్దేశం అన్యాపదేశంగా మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేసాడా అన్న అనుమానం కలిగింది.

ఆ కంఫ్యూజన్ ఏం

ఆ కంఫ్యూజన్ ఏం

రాత్రికల్లా ఆ కంఫ్యూజన్ ఏం లేకుండా తాను ఎవరిని అన్నాడో డైరెక్ట్ గానే చెప్పేసాడు వర్మ.అయితే సాయంత్రం ఇండైరెక్ట్ గా ఇచ్చిన డోస్ సరిపోదనిపించిందో వర్మ స్టైల్ తగ్గిందనిపించిందో గానీ ఈసారి డైరెక్ట్గా ఎటాక్ చేసాడు ఈ సారి సూపర్ స్టార్ మహేష్ ని కూడా కలుపుకుని మరీ పంచ్ విసిరాడు.

‘‘బాహుబలి-2' తర్వాత టాలీవుడ్‌లో

‘‘బాహుబలి-2' తర్వాత టాలీవుడ్‌లో

‘‘బాహుబలి-2' తర్వాత టాలీవుడ్‌లో పవర్‌ఫుల్‌ మెగా సూపర్‌స్టార్లందరికీ కూడా ప్రభాస్‌ కాలి గోటినందుకోవడానికి రెండున్నర జన్మలు పడుతుంది' అని ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్లతోనే టాలీవుడ్ గగ్గోలెత్తి పోతూంటే ఇప్పుడు మరో డుగు ముందుకు వేసి ఇంకో దారుణమైన ట్వీట్ తో రగులుతున్న వివాదం లో మరింత పెట్రోల్ పోసాడు.

ఒక్కరోజులోనే రికార్డుల

ఒక్కరోజులోనే రికార్డుల

ఒక్కరోజులోనే రికార్డుల మోత మోగించిన బాహుబలి-2 ట్రైలర్.. విడుదలైన అన్ని భాషల్లో కలిపి 50 మిలియన్.. అంటే 5 కోట్ల వ్యూస్‌ను దాటిపోయింది. ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన వర్మ.. ‘‘ఈ ఫిగర్‌ను చూసి టాలీవుడ్‌లో ఎంత మంది ఆత్మహత్య చేసుకుంటారో అని భయంగా ఉంది'' అంటూ ట్వీట్ చేశాడు.

సామాన్య ప్రేక్షకులే ఎక్కువ

సామాన్య ప్రేక్షకులే ఎక్కువ

ఇప్పుడు మొదలయ్యింది అసలు దుమారం. మెగా అభిమానులే కాదు తెలుగు ప్రేకషకుల్లో మరికొందరు కూడా వర్మని దుయ్యబట్టటం మొదలు పెట్టారు. అంతకంతకూ పెరుగుతున్న ఈ వివాదం ఎక్కడిదాకా తీసుకు వెల్తాడో మరి, అయినా వర్మ మరీ ఇంత కచ్చగా పెట్టే ట్వీట్లకి ఎవర్ని టార్గెట్ చేసాడో వాళ్ళకన్నా ఇప్పుడు సామాన్య ప్రేక్షకులే ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు.

English summary
"Ee figureni choosi Tollywood lo yenthamandhi aatma hatya chesukuntaro ani bhayamgaa vundhi" Tweets ramgopal varma
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu