twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒకే ఒక్కడు

    By Staff
    |

    హిందీచిత్రరంగంలో దక్షిణాది వారుఎందుకు నిలదొక్కుకోలేరు?దక్షిణాదిన విజయవంతమైనసినిమాలు తీసే దర్శకులు, హీరోలుహిందీలో మాత్రం ఎందుకు విజయాన్నిసాధించలేకపోతున్నారు. దక్షిణాదిచిత్రాల హిందీ రీమేక్‌లు ఉత్తరాది వారినిఎందుకు ఆకర్షించలేకపోతున్నాయి? ఈప్రశ్నలు ఎప్పటినుంచో దక్షిణాదినచాలామందిని వేధిస్తోన్న ప్రశ్నలు.దక్షిణాది చలనచిత్రరంగంలో ఎంతోమంది గొప్ప దర్శకులున్నారు. ఆమాటకొస్తే, బాలీవుడ్‌తో పోల్చితే,దక్షిణాదిలో సున్నితమైన,హృదయానికి హత్తుకునే(సెన్సిబుల్‌ మూవీస్‌) చిత్రాలు తీసేదర్శకుల శాతం చాలా ఎక్కువ. బాపు,కె.విశ్వనాథ్‌, బాలచందర్‌,భారతీరాజా, బాలుమహేంద్రల నుంచిమణిరత్నం వరకు ఎందరోఉత్తమదర్శకులున్నారు.

    వీరంతాదేశంలో అతిపెద్ద మార్కెట్‌ అయినబాలీవుడ్‌లో కూడా రాణించేందుకుప్రయత్నించి విఫలమయ్యారు.మణిరత్నం తొలి చిత్రం దిల్‌సే(తెలుగులో ప్రేమతో, తమిళంలోఉయిరే)తో హిందీ మార్కెట్‌పైదృష్టి సారించారు. షారూఖ్‌ఖాన్‌లాంటిబడా హీరోతో తీసిన ఈ సినిమా పరాజయంపాలైంది. అనంతరం ఆయన తిరిగియువతో హిందీ రంగంలోకి(ఈశుక్రవారంవిడుదలైంది)అడుగుపెట్టారు.అజయ్‌దేవగన్‌, అభిషేక్‌బచ్చన్‌,వివేక్‌ ఓబెరాయ్‌, కరీనాకపూర్‌,రాణిముఖర్జీ లాంటి గొప్ప తారాగణంఉన్నా, ఈ సినిమా ఆకట్టులేకపోయింది. తొలినివేదికల ప్రకారం, ఓపెనింగ్స్‌బ్రహ్మండంగా ఉన్నా, సినిమా మాత్రంనిరాశపర్చినట్లేనని, పెద్ద హిట్‌కాదని తెలుస్తోంది.

    హిందీలోవిజయం సాధించాలని మణిరత్నంచేసిన మూడో ప్రయత్నం కూడా విఫలంకావడంతో, మన తెలుగు సినిమారంగం నుంచి వెళ్ళిన రాంగోపాల్‌వర్మ ఒక్కడే వెలుగొందుతున్నాడు.తెలుగు సినిమా పరిశ్రమపై అలకవహించి బాలీవుడ్‌లోకి రంగీలావంటి సూపర్‌ హిట్‌ చిత్రంతో స్థానాన్నిసుస్థిరం చేసుకొన్న రాంగోపాల్‌వర్మ ఇప్పుడు బాలీవుడ్‌నుఏలుతున్నాడనే చెప్పాలి. ఆయన నిర్మించేపలు సినిమాలు పరాజయం పాలైనా, ఆయనమాటకున్న పవర్‌, ఆయనకంపెనీకున్న పేరు మరెవ్వరికీమన దేశంలో ఇప్పుడు లేదన్నదిసత్యం.

    నిత్యప్రయోగశీలిగాపేరొందిన వర్మ మినహా ఇతరదక్షిణాది దర్శకులెవ్వరూ విజయంసాధించకపోవడానికి కారణమేమిటోపరిశీలిస్తే, భాష, సంస్కృతిసమస్యలేనని అన్పిస్తోంది.రాంగోపాల్‌వర్మ హైదరాబాద్‌లోపెరిగారు. ఉత్తరాధి సంస్కృతిఅధికంగా ఉండే నగరంలోపెరగడంతో పాటు, బాలీవుడ్‌టేస్ట్‌లు, ముంబై సంస్కృతిఅణువణువు తెలిసి ఉండడంతో ఆయనసినిమాల్లో దక్షిణాది వాసనలు ఎక్కడాఉండవు.

    అదేబాపు, బాలచందర్‌(ఏక్‌దూజ్‌కేలియాతో విజయం సాధించినా),కె.విశ్వనాథ్‌ల చిత్రాల్లో ఆంధ్ర,తమిళ పోకడలు ప్రస్పుటంగా కన్పించేవి.బాపయ్య, మురళీమనోహరరావువంటి వారు విజయాలు సాధించినా వారినిబిగ్రేడ్‌ డైరక్టర్‌లుగాపరిగణించాల్సిందే.రాఘవేంద్రరావుహిమ్మత్‌వాలా వంటి హిట్‌ చిత్రాలుతీసినా, ఆయనకు పెద్ద గొప్ప పేరులేదు.

    తెలుగు,తమిళ సినిమాలను హిందీలోకితీయాలనుకునే వారు తమ భాషా,ప్రాంత జాడ్యాలను వదిలించుకుంటేవిజయవంతమవుతారామో!

    Recent stories
    పనిచేయనిచిరంజీవి, రజనీల గ్లామర్‌

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X