అంజలీదేవికి రామినేని అవార్డ్
అమెరికాలో స్థిరపడ్డ డాక్టర్ రామినేని అయ్యన్న చౌదరి (సిన్సినటి, ఒహాయో) వారసులు ఒక ఉన్నతమైన ఆశయం కోసం ఏర్పాటు చేసిన రామినేని ఫౌండేషన్ వివిధ రంగాలలో ప్రతిభావంతంగా రాణించి, సమాజాభివృద్ధికి తోడ్పడిన వారికి ప్రతి యేటా అవార్డులు బహూకరిస్తున్నారు. భారతీయ సంస్కృతి, ఆదర్శాలు, హైందవ సంప్రదాయాలు నిలబెట్టడం రామినేని ఫౌండేషన్ ప్రధాన ఆశయం. ఈ క్రమంలో ఈ యేడాది ప్రతిష్టాత్మకమైన రామినేని ఫౌండేషన్ పురస్కారాన్ని న్యూఢిల్లీ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ కార్డియాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ కె. శ్రీనాథ్ రెడ్డికి అందజేయనున్నారు. ఆయనకు ఒక జ్ఞాపికతో పాటు 50 వేల రూపాయల నగదు కూడా అందజేస్తారు.
సుప్రసిద్ధ నటీమణి అంజలీదేవి, ప్రముఖ సంఘసేవకులు డాక్టర్ ఉమర్ అలీషా, ప్రఖ్యాత అకడమీషియన్ ప్రొఫెసర్ ఐ.వి. చలపతిరావు కూడా ఈ పురస్కారాలు అందుకోనున్నారు. వారికి ఒక జ్ఞాపికతో పాటు 25 వేల రూపాయల నగదు అందజేస్తారు. హైదరాబాద్ హోటల్ మారియట్‌లోని కన్వెన్షన్ సెంటర్‌లో అక్టోబర్ 12వ తేదీన సాయంత్రం ఈ పురస్కారాల ప్రదాన మహోత్సవం నిర్వహించనున్నట్లు డాక్టర్ రామినేని ఫౌండేషన్ ప్రతినిధులు ప్రకటించారు. ఫౌండేషన్ కన్వీనర్, సినీనటుడు ఏవీఎస్, రామినేని వారసులు హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ వివరాలను అందించారు.


Click it and Unblock the Notifications