రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ (రాఫ్ట్)
సృజనాత్మక రంగాల్లో రాణించాలనుకొనే వారికి ఇదో సువర్ణవకాశం అంటూ 'రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ (రాఫ్ట్)' ముందుకొస్తోంది. సినిమా ఫీల్డులో నిరూపించుకోవాలనుకునే ఔత్సాహికుల కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ శిక్షణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ అందించే కోర్సు వివరాలను రామోజీ ఫిల్మ్‌సిటీ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) ఎ.విశ్వంభర్ రావు శనివారం ఓ ప్రకటనలో విడుదల చేశారు.
ప్రకటనలో వారు తెలిపిన ఆ వివరాలు ఇలా ఉన్నాయి..పరిశ్రమ అంచనాలకు, అవసరాలకు అనుగుణంగా 'రాఫ్ట్' కోర్సులను రూపొందించారు. తరగతి గదిలో శిక్షణ, ప్రాక్టికల్ నాలెడ్జి సమతూకంగా ఉంటుంది. సాంకేతికత, సృజనాత్మకత మేళవింపుతో దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, నటన, కూర్పు (ఎడిటింగ్), సౌండ్ డిజైన్ తదితర అంశాల్లో రాఫ్ట్ ఉన్నత స్థాయి శిక్షణ అందిస్తుంది అంటున్నారు. అలాగే రాఫ్ట్ విద్యార్థుల కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో స్టూడియోలు, సెట్లు, కెమేరా-సంబంధిత ఉపకరణాలు, నిర్మాణానంతర కార్యక్రమ సౌకర్యాలతో పాటు ప్రపంచస్థాయి శిక్షణ వసతులన్నీ అందుబాటులో ఉంటాయి.
ఇక కోర్సుల్లో చేరేవారకి అర్హతలు చెబుతూ..డైరెక్షన్, సినిమాటోగ్రఫీ...ఏదైనా డిగ్రీ. చివరి సంవత్సరం పరీక్షలు రాసిన వారు కూడా అర్హులే. నటన, కూర్పు, ఆడియో రికార్డింగ్, సౌండ్ డిజైన్: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష. కూర్పు, సౌండ్ కోర్సుల్లో చేరే అభ్యర్థులకు కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ తప్పనిసరి. అన్ని కోర్సులకూ బోధన ఆంగ్లమాధ్యమంలోనే ఉంటుంది. ఈ చిత్రం ఎంపిక విధానం..దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది. వడపోత అనంతరం ఎంపిక చేసిన అభ్యర్థులకు మౌఖికపరీక్ష(ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. నటనలో శిక్షణ పొందాలనుకునే వారికి స్క్రీన్ టెస్ట్ చేస్తారు. మరిన్ని వివరాలకు raft.ramojifilmcity.com చూడొచ్చు.


Click it and Unblock the Notifications











