»   » బాహుబలి : రాజమౌళికి రామోజీరావు లేఖ

బాహుబలి : రాజమౌళికి రామోజీరావు లేఖ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న తెలుగు దర్శకుడు రాజమౌళిపై సినీ నిర్మాత, రామోజీ సంస్థ అధినేత రామోజీ రావు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు రాజమౌళిని ప్రశంసిస్తూ లేక రాసారు. ఫిల్మ్ సిటీలో ఆర్డ్ డైరెక్టర్ సాబు సిరిల్ వేసి సెట్స్ చూసానని, అద్భుతంగా ఉన్నాయని....సెట్స్ చూస్తుంటే తెలుగు సినిమా చరిత్రలో బాహుబలి ఒక గొప్ప చిత్రగా నిలిచే విధంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు రాజమౌళి. ఆయన ప్రశంసలు నాకు 100 అవార్డులతో సమానమని, సినిమా ప్రేక్షకులకు నచ్చే విధంగా తీయడానికి శక్తిమేర ప్రయత్నిస్తామని రాజమౌళి పేర్కొన్నారు.

సినిమా వివరాల్లోకి వెళితే...ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి' . రమ్య కృష్ణ, సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈచిత్రానికి సంబంధించిన 2 షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మరోదఫా చిత్రీకరణ కోసం సాబు సిరిల్‌ కొత్త సెట్‌ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి యార్లగడ్డ శోభు నిర్మాత. ఈ నెల 15 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరగబోతోంది. చిత్ర బృందంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారు.

<blockquote class="twitter-tweet blockquote"><p>THIS for me is worth a 100 awards! And <a href="https://twitter.com/search?q=%23Baahubali&src=hash">#Baahubali</a> team wil try its level best2 live upto the great man’s appreciation <a href="http://t.co/MF1aj8fCrt">pic.twitter.com/MF1aj8fCrt</a></p>— rajamouli ss (@ssrajamouli) <a href="https://twitter.com/ssrajamouli/statuses/378505235062214656">September 13, 2013</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. 'బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ ఆధ్వర్యంలో సెట్స్ వేసారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది.

దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.

English summary
Rajamouli's 'Baahubali' is being shot in Ramoji Film City. Apparently, Ramoji Rao happened to go around the sets of the film and he was quite impressed with what he saw. Ramoji Rao then sent a letter of appreciation to Rajamouli.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu