వర్మపై సెటైర్ ' రామూ బన్‌గయా పాగల్'
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ని ఉద్ధేశిస్తూ సినిమాలు తీసే వారి సంఖ్య పెరిగిపోతోంది.తాజాగా ఆయన్ని సెటైర్ చేస్తూ... ' రామూ బన్‌గయా పాగల్' చిత్రం ఒకటి తయారవుతోందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే తెలుగులో 'మూర్ఖుడు' చిత్రం ఆయన్ని విమర్సిస్తూ రెడి అవుతోంది. అలాగే తెలుగులో అయితే రామ్‌గోపాల్ వర్మ లేకపోతే మన ఖర్మ'' అనే టైటిల్ తో మరో చిత్రం కూడా వస్తున్నట్లు తెలిసింది. ఈ టైటిల్‌ను రిజిస్టర్ కూడా చేశారు. ఇక వర్మ ప్రస్తుతం ఇది ప్రేమ కథ కాదు అనే చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. అలాగే నాగచైతన్య హీరోగా బెజవాడ రౌడీలు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వీటితో పాటు భూ అనే హర్రర్ చిత్రాన్ని కూడా రూపొందించటానికి స్క్రిప్టు వర్క్ చేయిస్తున్నారు. వీటితో పాటు భారీ కాస్టింగ్ తో డిపార్టమెంట్ చిత్రాన్ని డైరక్ట్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. రానా హీరోగా చేసే ఈ చిత్రం పోలీస్ డిపార్టమెంట్ నేపధ్యంలో జరుగుతుంది.


Click it and Unblock the Notifications











