'నాగచైతన్య' తో 'వర్మ' చిత్రం
నాగార్జున సినిమా కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ మూవీ "శివ". రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో రాము నాగార్జునకే కాదు, టాలీవుడ్ కీ ఓ తిరిగులేని విజయాన్ని అందించాడు. ఆ మాటకొస్తే శివ చిత్రం టాలీవుడ్ దిశను, దశను ఆ చిత్రం మార్చేసిందని అంటుంటారు సినీవిశ్లేషకులు. కమర్షియల్ సక్సెస్ తో పాటు, తెలుగు సినిమాని సరికొత్త ట్రెండ్ వైపు "శివ" పరుగులు తీయించిందనేది నిర్వివాదాంశం.
ఇంతకీ ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎందుకంటే అప్పుడు నాగార్జునకు హిట్ ఇచ్చిన వర్మ, ఇప్పుడు నాగ్ తనయుడు చైతన్యతో మరో ట్రెండ్ సెట్టర్ మూవీకి శ్రీకారం చుట్టబోతున్నారని సమాచారం. 'అక్కినేని' మరో వారసుడు సుమంత్ తో "ప్రేమకథ" చిత్రాన్ని తీసి ఫెయిల్యూర్ ని చవిచూసిన వర్మ చైతు తో మాత్రం తప్పకుండా హిట్ కొడతాననే ధీమాతో వున్నారట.
naga chaitanya ram gopal varma josh shiva nagarjuna sumanth karthika prema katha adavi nitin నాగచైతన్య రామ్ గోపాల్ వర్మ జోష్ శివ నాగార్జున సుమంత్ కార్తిక ప్రేమకథ అడవి నితిన్


Click it and Unblock the Notifications