twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ గోపాల్ వర్మ పై ఎక్స్ హీరోయిన్ కంప్లైయింట్

    By Srikanya
    |

    రామ్ గోపాల్ వర్మపై ఇషా కొప్పీకర్ అనే బాలీవుడ్ హీరోయిన్ తనకు రావాల్సిన డబ్బు ఎగ్గొట్టారంటూ కంప్లైయింట్ చేసింది. ఆమె రామ్ గోపాల్ వర్మతో డార్లింగ్ అనే చిత్రంలో చేసింది. ఆ చిత్రం నిమిత్తం మొత్తంలో ఆమె పదమూడు లక్షలు బాకీ ఉందిని ఆ కంప్లైయింట్ లో తెలిపింది. ఈ కేసుని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లైయిర్స్ వారు తీసుకున్నారు. వారు వెంటనే రామ్ గోపాల్ వర్మకు నాన్ కోపరేషన్ ఏక్షన్ తీసుకున్నారు. అలాగే ఆయన డైరక్ట్ చేస్తున్న తాజా చిత్రం రక్త చరిత్ర కు ఎవరూ సహకరించకూడదని ఆజ్ఞలు జారీ చేసింది. అయితే రామ్ గోపాల్ వర్మకి చెందిన వారు చెప్పటం ప్రకారం..రక్త చరిత్ర ఆపాలంటూ ఫెడరేషన్ నోటీస్ పంపిన విషయం నిజమే. అయితే వెంటనే రామూ స్పందించి..ఆమెకు ఇవ్వాల్సిన పదమూడు లక్షలను...ఏడు లక్షలకు సెటిల్ చేసుకుని చెక్ ఇష్యూ చేసారు అన్నారు. ఇక ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ...హైదరాబాద్ లో కథ, స్క్రీన్ ప్లే, దర్సకత్వం..అప్పలరాజు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X