హీరోయిన్ రమ్య ఏమైంది? డిసెంబర్లో బ్యాక్?

By Bojja Kumar

బెంగలూరు: కన్నడ హీరోయిన్ రమ్య అలియాస్ దివ్య స్పందన గురంచి అందరికీ తెలిసిందే. తన అందచందాలతో సాండల్ వుడ్ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. గత కొన్ని రోజులుగా బెంగలూరులో కనిపించడం లేదు. ఆ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా గెలిచిన రమ్య ఆ తర్వాత జరిగిన సాధరణ ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తర్వాత కొంతకాలానికే ఆమె బెంగలూరు నుండి మాయమైంది.

మరో వైపు ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కూడా ఆమె అసలు యాక్టివ్‌గా ఉండటం లేదు. కన్నడ వార్తా పత్రికలు ఆమెపై మిస్సింగ్ క్వీన్ అంటూ వార్తాకథనాలు సంధించాయి. అయినా సరే ఆమె గురించిన సమాచారం ఎవరి వద్దా లేదు. అసలు ఎక్కడికి వెళ్లిందో తెలియని పరిస్థితి.

Ramya Coming Back To India In December

ఆమె తన సన్నిహితులకు, బంధువులకు ఎవరికీ టచ్ లో ఉండటం లేదు. చివరికి స్నేహితులకు కూడా ఆమె ఎక్కడ ఉందనే సమాచారం లేదు. అయితే రమ్య లండన్లో ఉందనే వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. ఆమె తన మకాం పూర్తిగా లండన్‌కు మార్చే యోచనలో ఉందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి.

బెంగలూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ అపార్టుమెంటు నుండి కూడా తన రూం ఖాళీ చేసింది. ఉన్నత చదువుల కోసమే ఆమె లండన్ వెళ్లిందని కొందరు అంటున్నారు. ఆమె వెంట ఆమె తల్లి కూడా ఉందట. డిసెంబర్లో ఆమె తిరిగి బెంగలూరు వచ్చే అవకాశం ఉందని అనధికారిక సమాచారం.

More from Filmibeat

Read more about: ramya రమ్య
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X