పోలీసాఫీసర్ పాత్రలో రమ్యకృష్ణ
హైదరాబాద్: రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. బాహుబలిలో కీలకమైన పాత్ర చేస్తున్న ఆమె లాంగ్వేజ్ సినిమాలు కూడా ఒప్పుకుంటోంది. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత ఓ మలయాళ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా పేరు 'డ్రైవర్ ఇన్ డ్యూటీ'. మలయాళ సినిమా లేటెస్ట్ క్రేజీ హీరో అసిఫ్ అలీ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి మనోజ్ దర్శకుడు.
హాస్య చిత్రంగా తయారవుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ పోలీసాఫీసర్ కేరక్టర్ చేస్తున్నారు. ఆమె గెటప్ సినిమాకు హైలెట్ అని చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న మహిళా పోలీసు ఉద్యోగులకు ప్రతినిథిగా ఆమె ఈ చిత్రంలో కనిపిస్తారు. ఆ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే డ్రైవర్‌గా అసిఫ్ నటిస్తున్నాడు. చివరిసారిగా రమ్యకృష్ణ నటించిన మలయాళ సినిమా 'ఒరే కడల్' (2007). అందులో ఆమెతో పాటు మమ్ముట్టి, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఇక డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మాకంగా తీస్తున్న సినిమా 'బాహుబలి'. ఈ సినిమాలో మరో నటి రమ్యకృష్ణ కూడా నటిస్తోంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ ప్రభాస్, రానాల తల్లిగా నటించనుందని తెలిసింది. గతంలో 'యముడికి మొగడు' సినిమాలో యముడు భార్య పాత్రలో నటించి అందరిని మెప్పించిన తను రాజసం ఉట్టిపడే ఈ పాత్రకి సరైన న్యాయం చేస్తుందని అందరూ బావిస్తున్నారు.
ప్రభాస్ హీరోగా అనుష్క హీరోయిన్ గా ఈ సినిమాలో రానా విలన్ గా కనిపించనున్నాడు. ఆర్క మీడియా బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications












