twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి "నీలాంబరి" కనిపించనుందా?: మంత్రి "పరిటాల సునీత" పాత్రలో రమ్యకృష్ణ?

    ప‌రిటాల ర‌వి భార్య‌, ప్ర‌స్తుత మంత్రి అయిన ప‌రిటాల సునీత పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ క‌న‌బ‌డ‌నున్న‌ట్టు వార్త‌లు వస్తున్నాయి.

    |

    కొన్నేళ్ళకిందట తమిళ్ లో పడయప్పా అనే సినిమా వచ్చింది అది తర్వాత తెలుగులో నరసింహ గా వచ్చింది. మనకు మామూగా హిట్ అయ్యిందేమోగానీ తమిళుల మనసులో మాత్రం "నీలాంబరి పాత్ర రజినీకాంత్ కంటే ఎక్కువగా ఆకట్టుకుంది. ఆ పాత్ర చేసిన రమ్యకృష్ణ తమిళ ప్రేక్షకుల మనసుల్లో నిలిచి పోయింది. అప్పట్లో ఆ పాత్ర కొంత వరకూ జయలలిత ని పోలి ఉందనే టాక్ వచ్చింది. ఆ పాత్రని అంత హుందాగానూ, అంతే పొగరుతోనూ చేసింది రమ్యకృష్ణ, ఆఖరికి రజినీ కూడా తనకు ధీటుగా రమ్య ఆపాత్రని చేసిందీ అంటూ ఒప్పుకునేంతగా ఆప్ట్ గా ఆపాత్రలో ఒదిగిపోయింది ఈ శివగామి.

    ఆ తర్వాత ఈ మధ్య వచ్చిన బాహుబలి లో కూడా రాజమాత శివగామీ దేవి పాత్రకీ అదే స్థాయిలో ప్రాణం పోసింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకో నిజజీవిత పాత్రలో కనిపించనుందట రమ్యకృష్ణ, అయితే ఈ సినిమా బయో పిక్ మాత్రం కాదు ఆనాటి నరసింహ లాగానే వస్తూన్న కల్పిత కథలో నిజజీవిత పాత్రని పోలి ఉండే పాత్ర.

    Ramya Krishna as Paritala sunitha in Balakrishnudu?

    ప‌రిటాల ర‌వి భార్య‌, ప్ర‌స్తుత మంత్రి అయిన ప‌రిటాల సునీత పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ క‌న‌బ‌డ‌నున్న‌ట్టు వార్త‌లు వస్తున్నాయి. ప‌రిటాల ర‌వి జీవిత క‌థను స్ఫూర్తిగా తీసుకుని రాసిన క‌ల్పిత క‌థ‌తోనే నారా రోహిత్ హీరోగా "బాల‌కృష్ణుడు" సినిమా తెరకెక్కుతోందట. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా దాదాపు ప‌రిటాల ర‌వి జీవిత క‌థనే పోలి ఉంటుంద‌ట‌.

    Recommended Video

    Ramya Krishna as Jayalalithaa in Biopic 'Mother' Movie ? | 'అమ్మ' గా రమ్యకృష్ణ | Filmibeat Telugu

    ప‌రిటాల ర‌వి కిడ్నాప్‌, ఆ సమ‌యంలో ఆయ‌న భార్య స్పందించిన విధానం, ఆమె పోరాటం త‌దిత‌ర అంశాల నేప‌థ్యంలో ఈ సినిమా ఉంటుంద‌ట‌. ప‌రిటాల ర‌విని కిడ్నాప్ చేసిన వ్య‌క్తిగా నారా రోహిత్‌, భార్య పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ క‌నిపించ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌లు ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

    English summary
    A new Report about Roming in film nagar circles that Sivagami Ramyakrishna doing a role in Nara Rohit's balakrishnudu is familiar to Minister Paritala Sunitha.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X