Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరోసారి "నీలాంబరి" కనిపించనుందా?: మంత్రి "పరిటాల సునీత" పాత్రలో రమ్యకృష్ణ?
పరిటాల రవి భార్య, ప్రస్తుత మంత్రి అయిన పరిటాల సునీత పాత్రలో రమ్యకృష్ణ కనబడనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
కొన్నేళ్ళకిందట తమిళ్ లో పడయప్పా అనే సినిమా వచ్చింది అది తర్వాత తెలుగులో నరసింహ గా వచ్చింది. మనకు మామూగా హిట్ అయ్యిందేమోగానీ తమిళుల మనసులో మాత్రం "నీలాంబరి పాత్ర రజినీకాంత్ కంటే ఎక్కువగా ఆకట్టుకుంది. ఆ పాత్ర చేసిన రమ్యకృష్ణ తమిళ ప్రేక్షకుల మనసుల్లో నిలిచి పోయింది. అప్పట్లో ఆ పాత్ర కొంత వరకూ జయలలిత ని పోలి ఉందనే టాక్ వచ్చింది. ఆ పాత్రని అంత హుందాగానూ, అంతే పొగరుతోనూ చేసింది రమ్యకృష్ణ, ఆఖరికి రజినీ కూడా తనకు ధీటుగా రమ్య ఆపాత్రని చేసిందీ అంటూ ఒప్పుకునేంతగా ఆప్ట్ గా ఆపాత్రలో ఒదిగిపోయింది ఈ శివగామి.
ఆ తర్వాత ఈ మధ్య వచ్చిన బాహుబలి లో కూడా రాజమాత శివగామీ దేవి పాత్రకీ అదే స్థాయిలో ప్రాణం పోసింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకో నిజజీవిత పాత్రలో కనిపించనుందట రమ్యకృష్ణ, అయితే ఈ సినిమా బయో పిక్ మాత్రం కాదు ఆనాటి నరసింహ లాగానే వస్తూన్న కల్పిత కథలో నిజజీవిత పాత్రని పోలి ఉండే పాత్ర.
పరిటాల రవి భార్య, ప్రస్తుత మంత్రి అయిన పరిటాల సునీత పాత్రలో రమ్యకృష్ణ కనబడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. పరిటాల రవి జీవిత కథను స్ఫూర్తిగా తీసుకుని రాసిన కల్పిత కథతోనే నారా రోహిత్ హీరోగా "బాలకృష్ణుడు" సినిమా తెరకెక్కుతోందట. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు పరిటాల రవి జీవిత కథనే పోలి ఉంటుందట.
Recommended Video
పరిటాల రవి కిడ్నాప్, ఆ సమయంలో ఆయన భార్య స్పందించిన విధానం, ఆమె పోరాటం తదితర అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. పరిటాల రవిని కిడ్నాప్ చేసిన వ్యక్తిగా నారా రోహిత్, భార్య పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.