»   » లొల్లి : రమ్యకృష్ణ ఆ పాత్ర చేస్తుందా?

లొల్లి : రమ్యకృష్ణ ఆ పాత్ర చేస్తుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలంగాణా నేపథ్యంలో తెరకెక్కి ఆదరణ పొందిన ‘కొలిమి' చిత్రాన్ని రూపొందించిన చరిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై, కాలేజ్ నేపథ్యంలో రూపొందుతోన్న అందమైన ప్రేమకథ ‘లొల్లి'. మనోజ్ దర్శకత్వంలో జి.ఉమా పార్వతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణను జరుపుకోనుంది. ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాత జి.ఉమా పార్వతి మాట్లాడుతూ ‘కొలిమి సినిమా తర్వాత మా బ్యానర్ లో రూపొందుతోన్న చిత్రం లొల్లి. ఇదొక కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే క్యూట్ లవ్ స్టోరీ. ప్రముఖ దర్శకులు సురేష్ కృష్ణ, కృష్ణ వంశీ దగ్గర పనిచేసిన మనోజ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారని తెలిపారు.

 Ramya Krishna as professor in Lolli

ఈ సినిమాలో ప్రముఖ హీరోహీరోయిన్లు నటిస్తున్నారు. అలాగే ఇందులో కాలేజ్ లో పనిచేసే ప్రొఫెసర్ పాత్రలో ప్రముఖ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. నటీనటుల, టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం'' అన్నారు. పోసాని కృష్ణమురళి, షకలక శంకర్, రఘుబాబు, సప్తగిరి, పృథ్వీ, కాట్రాజు తదిరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

English summary
Ramya Krishna playing as professor role in upcoming movie Lolli, directed by Suresh Krishna.
Please Wait while comments are loading...