ఐసీయూ బెడ్‌పై అక్కినేని నాగేశ్వరరావు చివరి మాటలు.. రమ్యకృష్ణ, చిరంజీవి, వెంకీ కంటతడి

స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హాజరయ్యారు. ఈ అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ప్రధానం చేశారు. ఈ వేడుకలో అక్కినేని కుటుంబ సభ్యులతోపాటు నాని, వెంకటేష్, రమ్యకృష్ణ, నాగ్ అశ్విన్, సినీ నిర్మాతలు, దర్శకులు తదితరలుు హాజరయ్యారు.

ఈ వేడుకలో అక్కినేని నాగేశ్వరరావు తాను క్యాన్సర్‌తో పోరాడుతూ ఐసీయూలో ఉండి తన కుటుంబానికి పంపిన ఆడియో ఫైల్‌ను స్క్రీన్ మీద వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు విని వేదిక వద్ద ఉన్నవారంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే..

Akkineni Nageswara Rao last words

నా శ్రేయోభిలాషులందరూ నా పట్ల ఎంత శ్రద్ద వహిస్తున్నారు. నా ఆరోగ్యం పట్ల ఆతృత పడుతున్నారో నాకు తెలుసు. నా కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు నా హెల్త్ పట్ల ఎప్పటికప్పుడు నా ప్రొగ్రెస్ రిపోర్టు చేస్తున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా.. నా బాధ పెట్టకుండా డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. నా హెల్త్ కూడా మెరుగు పడుతున్నది. అని నాగేశ్వరరావు తన ఫీలింగ్స్‌ను కుటుంబ సభ్యులతో పంచుకొన్నారు.

నేను బాగానే ఉన్నాను. నేను రికవరీ అవుతున్నాను. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే బయటకు వచ్చేస్తాను. త్వరలోనే మీ అందరికి అందుబాటులో ఉండే విధంగా.. ఆరోగ్యం తయారైందుకు సిద్దంగా ఉన్నాను అని నాగేశ్వరరావు హస్పిటల్ బెడ్ మీద నుంచి వాట్సప్ ద్వారా పంపిన ఆడియో ఫైల్ అందర్నీ విషాదంలోకి, అలాగే భావోద్వేగానికి గురి చేసింది.

మీ ఆశ్వీర్వాదాలు నాకు ఎప్పుడూ ఉంటాయని తెలుసు. నా ఆరోగ్యం, నా సంతోషం, నా ఆస్తి, అవన్నీ నాకు ఆశీర్వాదాలు. అనేక సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండటానికి వీలు ఉంటుందనే నమ్మకం నాలో బలంగా ఉంది. అది అలాగే కొనసాగాలి. సెలవు. మీ ఆశీర్వాదమే నాకు ముఖ్యం అని అక్కినేని నాగేశ్వరరావు ఐసీయూ నుంచి పంపిన ఆడియో ఫైల్‌ను సభలో ఆడియో విజువల్‌గా ప్రదర్శించారు.

ఏఎన్నాఆర్ జాతీయ పురస్కారం ప్రధానం సందర్భంగా ప్రదర్శించిన ఏవీ (AV)లో అక్కినేని మాటలు విన్నప్పుడు అందరూ కంటతడి పెట్టుకొన్నారు. రమ్యకృష్ణ ఆ వీడియో విన్నంత సేపు ఆమె కంట్లో నీరు ధారగా కారుతూ కనిపించింది. చిరంజీవి, వెంకటేష్, ఇతరులు భావోద్వేగానికి గురయ్యారు. తమ కంట్లో ఉబికి వస్తున్న కన్నీటిని కంట్రోల్ చేసుకొంటూ చాలా మంది తెలుగు సినిమా ప్రముఖులు కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X