మెలి‌తిరిగి ఉంటే నాదే అంటున్న రమ్యకృష్ణ

By Bojja Kumar

హైదరాబాద్: మెలితిరిగి ఉన్నా నాదే... అంటూ హీరోయిన్ సిమ్రన్ ఇటీవల బెల్లితెరపై 'కుర్ కురే' యాడ్లో తెగ హడావుడి చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ఆ స్థానంలో ఒకప్పటి హాట్ హీరోయిన్ రమ్యకృష్ణ కనిపించనుంది. తాజాగా ఆమె కుర్‌కురె ప్రొడక్ట్స్ కు సౌతిండియా బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయింది.

ఒకప్పుడు దక్షిణాది సినిమాల్లో తన అభినయం, అందాల ఆరబోతతో టాప్ హీరోయిన్‌గా వెలిగిన రమ్య కృష్ణ.... వయసు పైబడ్డాక హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిలైంది. ప్రస్తుతం ఆమె పలు సినిమాల్లో అత్త పాత్రల్లో రాణిస్తోంది. ఇటీవల విడుదలైన 'యముడికి మొగుడు' చిత్రంతో పాటు పలు స్టార్ హీరోల చిత్రాల్లో అత్త క్యారెక్టర్‌తో అదర గొట్టింది.

ఇప్పటి వరకు కుర్ కురె యాడ్లో బాలీవుడ్ హీరోయిన్ జుహీ చావ్లా, సిమ్రన్, పరిణితీ చోప్రా తదితరులు నటించారు. ఎప్పటికప్పుడు కొత్త స్టార్స్‌తో తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయిస్తూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలించడంలో భాగంగానే కుర్ కురె వారు ఈ సారి రమ్య కృష్ణను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్నారు.

దక్షిణాది సిని పరిశ్రమలో హీరోలకు ఉన్నంత వాల్యూ... హీరోయిన్లకు ఉండటం లేదు. వారిని ఇప్పటికీ కేవలం అందాల బొమ్మలుగానే చూపెడుతున్నారు దర్శకులు. 60, 50 ఏళ్లు దాటినా...ఇప్పటికీ రజనీకాంత్, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి వారు హీరోలుగా కొనసాగుతూనే ఉన్నారు. అయితే హీరోయిన్ల పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నం. పాతిక... మహా అయితే 30 ఏళ్లు ఇంతకు మించి వయసున్న వారికి హీరోయిన్లు తీసుకున్న సందర్భాలు అసలు లేవనే చెప్పాలి. అవకాశాలు తగ్గాక హీరోయిన్లు.... సైడ్ క్యారెక్టర్లు చేస్తూ, టీవీ రియాల్టీ షో, యాడ్ ఫిల్మ్స్ చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X