రమ్యకృష్ణ ‘మధుర మీనాక్షి’ శివరాత్రికి
ప్రముఖ నటి, నిన్నటి తరం సెక్సీహీరోయిన్ రమ్యకృష్ణ ప్రస్తుతం 'మధుర మీనాక్షి' అనే భక్తి రస చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని శివరాత్రిని పురస్కరించుకుని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి రాజవంశీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురించి నిర్మాత మండలపు హరీష్ కుమార్ మాట్లాడుతూ......ఈ చిత్రంలో డివోషనల్ డ్రామాతో పాటు అందమైన ప్రేమకథ కూడా ఉందని చెప్పుకొచ్చారు. దర్శకుడు రాజవంశీ ఈ చిత్రానికి సంగీతం కూడా సమకూర్చడం మరో ఆసక్తికర విషయం. ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధిస్తుందని దర్శక నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రమ్యకృష్ణ నటించిన అమ్మోరు లాంటి భక్తిరస సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించాయి. ముఖ్యంగా దేవత పాత్రలు పోషించడంలో ఆమెకు సాటి మరెవరూ రారు.
హీరోయిన్ అవకాశాలు తగ్గి పోయిన తర్వాత దర్శకుడు కృష్ణవంశీని పెళ్లి చేసుకున్న రమ్యకృష్ణ.....అడపా దడపా పలు చిత్రాలు కనిపిస్తూనే ఉంది. చాలా కాలం తర్వాత ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా 'మధుర మీనాక్షి'. మరి ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications












