23 ఏళ్ళ తరువాత మళ్ళీ ఆ స్టార్ హీరోతో రమ్యకృష్ణ.. మళ్ళీ అదే స్థాయిలో పవర్ఫుల్ రోల్!
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ఆర్టిస్ట్ గా మారిపోయిన రమ్యకృష్ణ నార్త్ ఇండస్ట్రీలో కూడా శివగామిగా మంచి గుర్తింపును అందుకుంది. ఇక నెక్స్ట్ ఆమె నటించిన లైగర్ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ముఖ్యంగా నార్త్ ఇండస్ట్రీలో ఈ సినిమాకు మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. విజయ్ దేవరకొండ తల్లిగా కనిపించబోతున్న రమ్యకృష్ణ ఒక మాస్ తల్లిగా కనిపించబోతున్నట్లు ట్రైలర్ లోనే క్లారిటీ వచ్చేసింది.
అయితే ఇటీవల రమ్యకృష్ణ ఒక ఆసక్తికరమైన కాంబినేషన్ పై క్లారిటీ ఇచ్చింది సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఆమె చాలా కాలం తరువాత స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు వివరణ ఇచ్చారు. రజనీకాంత్ రమ్యకృష్ణ అనగానే అందరికీ ఎక్కువగా పడయప్పా (నరసింహ) సినిమా గుర్తుకు వస్తూ ఉంటుంది. తెలుగు తమిళంలో అప్పట్లో సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పటికీ కూడా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు.

అందులో లేడీ విలన్ గా రమ్యకృష్ణ చూపించిన హావ భావాలు అందరికీ ఎంతగానో నచ్చాయి. రజనీకాంత్ రమ్యకృష్ణ కలయిక మరోసారి ఆ విధంగా కనిపిస్తే బాగుంటుంది అని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ 169వ సినిమా చేస్తుండగా అందులో రమ్యకృష్ణ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోంది.
ఇందులో కూడా ఆమె రజినీకాంత్ కు ఆపోజిట్ గా నెగిటివ్ పాత్రలోనే కనిపించబోతుందట. ఇక ఆ సినిమా షూటింగ్ నేడు మొదలైంది. ఇందులో తన పాత్ర డిఫరెంట్ గా ఉండబోతోంది అని రమ్యకృష్ణ వివరణ కూడా ఇచ్చారు. ఇక ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ మేయిన్ లీడ్ లో నటిస్తూ ఉండగా శివ కార్తికేయన్ ఒక ముఖ్యమైన అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ అయితే వచ్చింది. ఇప్పటివరకు ఆ విషయంలో అయితే దర్శకుడు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ రజనీకాంత్ 169 సినిమాల్లో మాత్రం తాను నటిస్తున్నాను అని రమ్యకృష్ణ అధికారికంగా తెలియజేసింది. మరి ఈ కలయికకు ఈసారి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











