జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో రాజకీయ నేతగా సీనియర్ హీరోయిన్
సీనియర్ నటి రమ్యకృష్ణ గత కొంత కాలంగా ఎంచుకుంటున్న పాత్రలు చాలా పవర్ఫుల్ గా ఉంటున్నాయి. బాహుబలి నుంచి ఆమె శివగామిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుంది. ఈ సీనియర్ నటి తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా వరుసగా అవకాశాలను అందుకుంటోంది. ఎలాంటి సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ రికార్డులైతే క్రియేట్ చేస్తున్నాయి. ఇక త్వరలో ఆమె మరో పవర్ఫుల్ పొలిటికల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
తమిళ్ లో జయలలిత బయోపిక్ వెబ్ సిరీస్ గా రూపొందగా రమ్యకృష్ణ టైటిల్ రోల్ లో కనిపించిన విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో రమ్యకృష్ణ మహిళా రాజకీయ నేతగా కనిపించనుందని టాక్ వస్తోంది. సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాల్లో సీనియర్ నటీమణులను బలమైన పాత్రల్లో చూపిస్తుంటాడు. అత్తారింటికి దారేదిలో నదియా, ఆ తరువాత అల వైకుంఠపురములో టబు పాత్రలను ఏ విధంగా ప్రజెంట్ చేశాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఇక రమ్యకృష్ణ పాత్రను కూడా అదే తరహాలో చాలా పవర్ఫుల్ పొలిటీషియన్ గా ప్రజెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను పూర్తి చేసుకున్న మాటల మాంత్రికుడు త్వరలోనే సినిమాకు సంబంధించిన మరో స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మాత్రం ఎన్టీఆర్ RRR పనులను పూర్తి చేసిన తరువాతనే మొదలవుతుందట. అంటే ఫిబ్రవరిలో లేదా మార్చ్ లో మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











