సెన్సేషనల్ ప్రాజెక్ట్‌లో రమ్యకృష్ణ.. మరోసారి గ్రాండ్ ఎంట్రీతో శివగామి.. వైరల్‌గా ఫోటో

శివగామి రమ్యకృష్ణ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వయసు పెరుగుతున్నా కానీ అందం ఏ మాత్రం తగ్గడం లేదు. రమ్యకృష్ణ షేర్ చేసే ఫోటోలు చూస్తుంటే యంగ్ హీరోయిన్లకు కూడా పోటీ ఇచ్చేలానే ఉంది. లాక్ డౌన్‌లో రమ్యకృష్ణ షేర్ చేసిన ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక భర్త కృష్ణవంశీ పుట్టినరోజు వేడుకులకు సంబంధించిన ఫోటోలు చూస్తే అన్యోన్యతకు మారుపేరులా ఉన్నాయనే కామెంట్స్ వచ్చాయి. ఇలా లాక్ డౌన్ సమయంలో ఫోటోలను షేర్ చేస్తూ రమ్యకృష్ణ ఫుల్ బిజీగానే ఉంది.

Recommended Video

Aha Originals : Bhanumathi Rama Krishna Teaser | ఆహాలో ‘భానుమతి రామకృష్ణ'
అలా వివాదం..

అలా వివాదం..

లాక్ డౌన్‌లో రమ్యకృష్ణ ఓ వివాదంలో చిక్కుకుంది. తమిళ నాడులో ఆమె కారులో భారీగా మద్యం లభ్యంకావడం సంచలనంగా మారింది. లాక్ డౌన్‌లో మద్యంపై ఆంక్షలు ఉన్న సమయంలో ఆమె కారులో అంత మొత్తం లభించడంతో వ్యవహారాం పోలీసు స్టేషన్ వరకు చేరింది. కానీ ఆ వ్యవహారం వెంటనే సమసిపోయింది.

 సీమంతం ఫోటోలతో రచ్చ..

సీమంతం ఫోటోలతో రచ్చ..

రమ్యకృష్ణ ఈ ఖాళీ సమయంలో గతంలోకి వెళ్లి నాటి ఆనంద క్షణాలను గుర్తుకు తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ మధ్య రమ్యృష్ణ షేర్ చేసిన సీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి. అందులో తన అమ్మ కూడా ఉందని, ఆమె ఫోటోలు తీసిందని రమ్యకృష్ణ వివరించింది.

ఎమోషనల్ పోస్ట్..

ఎమోషనల్ పోస్ట్..

కృష్ణ వంశీ బర్త్ డే సందర్భంగా రమ్యకృష్ణ షేర్ చేసిన ఫోటోలు, చేసిన కామెంట్ తెగ హల్చల్ చేసింది. ‘సంతోషం, బాధ, కుటుంబం, గొడవలు, నా మొహంపై మొటిమ, నా ప్రతీ విషయంలో నీ వల్లే పరిపూర్ణత వచ్చింది. అంతా నీవల్లే.. హ్యాపీ బర్త్ డే'అంటూ భర్తపై ప్రేమను కురిపించింది.

చాలా రోజుల తరువాత..

చాలా రోజుల తరువాత..

సెలెబ్రిటీలు కరోనా, లాక్ డౌన్ కారణంగా దాదాపు ఐదారు నెలలుగా ఇంటి పట్టునే ఉంటూ వచ్చారు. అలాంటి వారు సడెన్‌గా సెట్‌లోకి అడుగుపెట్టడం, మేకప్ వేసుకోవడం కాస్త కొత్తగా అనిపించొచ్చు. రమ్యకృష్ణ తాజా షూటింగ్ మొదలెట్టేసింది. ఈ మేరకు మేకప్ వేసుకుంటూ రెడీ అవుతున్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘మీకు నాటి రోజులు గుర్తున్నాయా? వేసవి సెలవులు అయ్యాక స్కూల్‌కు వెళ్లాలంటే ఎలా ఫీలయ్యేవారో.. ప్రస్తుతం నాకు అదే ఫీలింగ్' అంటూ నటుల జీవితం, షూటింగ్స్ ఇలా ఉంటాయని రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది.

కొత్త షో..

కొత్త షో..

జీ టీవి తెలుగు కోసం రమ్యకృష్ణ మేకప్ వేసుకుంది. ఇది చాలా కొత్తగా ఉండబోతోంది.. ఎంతో ప్రత్యేకం.. త్వరలోనే మీ ముందుకు రాబోతోంది అని రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది. అయితే ఇది ఏదైనా కొత్త షోనా? వెబ్ సిరీసా? అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. రమ్యకృష్ణ ప్రస్తుతం రంగమార్తాండ, ఫైటర్ చిత్రాలను చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X