తమన్నా, రకుల్‌ని దాటేసిన రమ్యకృష్ణ.. కళ్ళు చెదిరే రెమ్యునరేషన్!
సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఇప్పటికి తన సత్తా చాటుతోంది. బాహుబలి తరువాత రమ్యకృష్ణ ఇమేజ్ మరింతగా పెరింది. శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటవిశ్వరూపం ప్రదర్శించింది. రమ్యకృష్ణ కోసం ప్రత్యేకంగా దర్శకులు పాత్రలు రరాస్తున్నారు. తనకు ఉన్న డిమాండ్ కు తగ్గట్లుగానే రమ్యకృష్ణ భారీ స్థాయిలో పారితోషకం అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రమ్యకృష్ణ రెమ్యునరేషన్ విషయంలో స్టార్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, తమన్నాని కూడా దాటిపోయింది. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదని తాజా ఆమె తీసుకుంటున్నా రెమ్యునరేషన్ లెక్కలే ఇందుకు నిదర్శనం అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం రమ్యకృష్ణ శైలజ రెడ్డి అల్లుడు చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి ఆమె రోజుకు 6 లక్షల పారితోషకం అందుకుతోందట. ఈ చిత్రానికి రమ్యకృష్ణ మొత్తం 25 రోజుల కాల్ షీట్స్ కేటాయించింది. ఈ లెక్కన ఈ చిత్రానికి రమ్యకృష్ణ అందుకుంటున్న పారితోషకం రూ 1.50 కోట్లు. రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు కోటి వరకు ఛార్జ్ చేస్తుంది. తమన్నా 70 లక్షల వరకు తీసుకుంటుంది. అంటే రమ్యకృష్ణ ప్రస్తుత స్టార్స్ తో పోటీ పడి మరీ పారితోషకం తీసుకుంటోందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











