ఇంతటి ఏకాంతం ఎప్పుడూ లేదు..బాగా ఎంజాయ్ చేస్తున్నా.. ‘శివగామి’ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని ఉంది. కరోనా వైరస్ ధాటికి ప్రపంచ మానవాళి మొత్తం వణికిపోతోంది. ఇప్పటికే మూడు లక్షలకుపైగా కరోనా మరణాలు సంభవించాయి. మనదేశంలోనూ కరోనా తాండవం చేస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి 80వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడి కోసం లాక్ ‌డౌన్ విధించినా.. ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోతోంది.

ప్రజలంతా ఇంటి పట్టునే..

ప్రజలంతా ఇంటి పట్టునే..

గత యాభై రోజులుగా లాక్ డౌన్ విధించగా ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. స్టార్ సెలెబ్రిటీల నుంచి సామాన్య ప్రజల వరకు ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇక కొంతమంది సెలెబ్రిటీలు ఈ లాక్ డౌన్ సమయాన్ని ఎంతో తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటున్నారు.

లాక్‌డౌన్‌లో రమ్యకృష్ణన్ విశేషాలు..

లాక్‌డౌన్‌లో రమ్యకృష్ణన్ విశేషాలు..

క్షణం కాలం పాటు తీరిక లేకుండా బిజిబిజీగా ఉండే నటీనటులు.. 24 గంటలపాటు ఇంట్లోనే ఉండటం కొత్త అనుభూతిలా ఉంటుంది. ఇదే విషయాన్ని విలక్షణ నటి రమ్యకృష్ణ చెబుతూ.. లాక్ డౌన్ అనుభవాలను పంచుకుంది. ఈ విశేషాలేంటో ఓ సారి చూద్దాం.

బాగా ఎంజాయ్ చేస్తున్నా..

బాగా ఎంజాయ్ చేస్తున్నా..

రమ్యకృష్ణ మాట్లాడుతూ.. ‘ఓ విధంగా చెప్పాలంటే, ఈ లాక్ డౌన్ అనేది జీవితంలో ఓ కొత్త అనుభవం. ఇంతటి ఖాళీ సమయం, ఏకాంతం గతంలో ఎప్పుడూ దొరకలేదు. చాలా హాయిగా వుంది. గత రెండు నెలలుగా గడపదాటి బయటకు వెళ్లలేదు. జీవితంలో అసలెప్పుడూ ఇలా ఇంటికి అతుక్కుపోలేదు. ఇప్పుడు కావలసినంత సమయం ఉంటోంది.. కుటుంబ సభ్యులతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నాను. జీవితంలో మళ్లీ ఇలాంటి సమయం ఇక రాదేమో..నా వరకు నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను.

Recommended Video

Jagapathi Babu Opens Up On The Affair With Soundarya
పలు ప్రాజెక్ట్‌లతో బిజీ..

పలు ప్రాజెక్ట్‌లతో బిజీ..

అయితే, మరోపక్క బాధ ఏమిటంటే, వలస కార్మికులు, నిరుపేదలు ఈ సమయంలో చాలా కష్టాలు పడుతున్నట్టు వార్తలు వింటున్నాం.. త్వరగా వారి కష్టాలు తీరాలని కోరుకుంటున్నాను' అని చెప్పింది. కాగా, ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ 'రంగమార్తాండ'లోను, పూరి-విజయ్ దేవరకొండ చిత్రంలోనూ, సాయి ధరమ్ తేజ్ చిత్రంలోనూ నటిస్తోంది. తాను చేస్తున్న సినిమాలన్నీ తనకి సంతృప్తిని ఇచ్చేవే అని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X