ఈ వయసులోనూ రమ్యకృష్ణ ఎంత హాట్!.. వీకెండ్‌లో అలా ఎంజాయ్ చేస్తుందట
రమ్యకృష్ణ పేరు ఈ లాక్ డౌన్ సమయంలో తెగ వైరల్ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రమ్యకృష్ణ లాక్ డౌన్‌లో చేసే కార్యకలాపాలను అన అభిమానులతో పంచుకుంటూ ఉండేది. అయితే ఆ మధ్య రమ్యకృష్ణ పేరు వార్తల్లో బాగా హైలెట్ అయింది. రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం లభించడంతో అటు తమిళనాట, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో రమ్యకృష్ణ పేరు మార్మోగింది. తాజాగా రమ్యకృష్ణ షేర్ చేసిన ఫోటోను చూసి అందరూ షాక్ అవుతున్నారు.

లాక్ డౌన్‌లో అలా..
లాక్ డౌన్ సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నా అని రమ్యకృష్ణ చెబుతూ..‘ఓ విధంగా చెప్పాలంటే, ఈ లాక్ డౌన్ అనేది జీవితంలో ఓ కొత్త అనుభవం. ఇంతటి ఖాళీ సమయం, ఏకాంతం గతంలో ఎప్పుడూ దొరకలేదు. చాలా హాయిగా వుంది. నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను' సంతోషాన్ని వ్యక్తం చేసింది.

ఆ ఘటనతో..
తమిళ నాట మద్యం విక్రయాలపై ఆంక్షలు ఉన్న సమయంలోనే రమ్యకృష్ణ కారులో భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ సమయంలో రమ్యకృష్ణ అక్కడ లేదని, ఆమె డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వినిపించాయి. ఆపై అతడిని రమకృష్ణ విడిపించుకుని తీసుకెళ్లిందని సమాచారం.

హాట్ ఫోటోతో హల్చల్..
తాజాగా రమ్యకృష్ణ ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వీకెండ్ వచ్చిందని, నెట్‌ఫ్లిక్స్‌తో చిల్ అవుతా అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్లు రమ్యకృష్ణ అందానికి ఫిదా అవుతున్నారు. అమ్మ పాత్రలు చేయకండి.. హీరోయిన్‌గానే చేయండని సలహాలు ఇస్తున్నారు.
Recommended Video

పలు ప్రాజెక్ట్‌లతో బిజీ..
రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా సాగుతోంది. బాహుబలి శివగామి తరువాత రమ్యకృష్ణ రేంజ్ మారింది. ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ 'రంగమార్తాండ', పూరి-విజయ్ దేవరకొండ చిత్రంలో, సాయి ధరమ్ తేజ్ చిత్రంలోనూ నటిస్తోంది. మొత్తానికి రమ్యకృష్ణ ఫుల్ జోరుమీదుంది.


Click it and Unblock the Notifications











