పవిత్రపై నాకు ఎలాంటి కంప్లయింట్ లేదు.. స్నేహితులైతే గదిలో పనేంటి?..రమ్య ప్రశ్నల వర్షం
నటుడు నరేష్, ఆయన మూడో భార్య రమ్య రఘుపతి, నటి పవిత్ర లోకేష్ మధ్య ఏర్పడిన వివాదం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా నరేష్ పవిత్ర కలిసి ఉన్న హోటల్ రూమ్ వద్ద రమ్య రఘుపతి పెద్ద ఎత్తున వివాదానికి కారణమయ్యారు. పవిత్ర లోకేష్ ను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తర్వాత ఆమె కన్నడ మీడియాతో మాట్లాడారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

ఎదురు చూశా
నటుడు నరేష్, పవిత్ర లోకేష్ మీద దాడి చేయడానికి ప్రయత్నించిన తర్వాత రమ్య రఘుపతిని పోలీసులు అదుపులోకి తీసుకుని హోటల్ నుంచి బయటికి పంపించారు. ఈ క్రమంలోనే ఆమె మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ మరిన్ని వివరాలు వెల్లడించారు. వారిద్దరు కలిసి ఉన్నారనే విషయం రాత్రి తెలిసిందని బెంగళూరు నుంచి రాత్రి సమయంలోనే ఇక్కడికి వచ్చినా కానీ రాత్రి సమయంలో వారిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఎదురు చూశానని అన్నారు.

స్నేహితులని
రాత్రి సమయంలో ఇలా గలాటా చేసే రకం తాను కాదంటూ ఆమె పేర్కొన్నారు. ఆయనని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే వారు ఎలా అల్లరి చేశారో మీరే చూశారని ఆమె చెప్పుకొచ్చారు. మీ ఇంట్లో ఆడపిల్లకు కూడా ఇలాగే జరిగితే చూస్తూ ఊరుకుంటారా అంటూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించిన రమ్య వారిద్దరూ స్నేహితులని చెప్పుకుంటున్నారని స్నేహితులైతే ఇలాగే ఒక గదిలో ఉంటారా అంటూ ప్రశ్నించారు.

మన ఇంటి బంగారమే
ఇక పవిత్ర లోకేష్ కి భర్త ఉన్నాడు కదా స్నేహితులైతే భర్తతో కలిసే నరేష్ ను కలవచ్చు కదా ఒక గదిలో వాళ్ళకి ఏం పని అంటూ ఆమె ప్రశ్నించారు. నన్ను చూడగానే గిల్టుగా ఫీల్ అయ్యాడని అందుకే ఈలలు వేస్తూ పిచ్చిగా బిహేవ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారని ఆమె పేర్కొన్నారు. బయటి వాళ్ళని అనేముందు మన ఇంటి బంగారమే సరిగా లేదని అందుకే నా జీవితం ఇలా తయారైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తేల్చుకుందాం అని
పవిత్ర లోకేష్ గురించి మాట్లాడడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని తాను చెప్పేదంతా నరేష్ గురించి అని ఆమె అన్నారు. నరేష్ తో మాట్లాడాలన్నా కుదరడం లేదని నా ఫోన్ నెంబర్ బ్లాక్ లో పెట్టారని అందుకే ఎదురుగా తేల్చుకుందాం అని ఇక్కడికి వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో లీగల్గా ప్రొసీడ్ అవుతున్నానని పేర్కొన్న రమ్య ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టు కూడా వెల్లడించారు.

తండ్రి కావాలని
అసలు నరేష్ భార్యగా నరేష్ ఎలాంటి వారు అనే విషయం మీద తనకు అవగాహన ఉందని సుమారు 10 ఏళ్లుగా ఈ విషయాలు మీద తనకు అవగాహన ఉందని పేర్కొన్నారు. ఇవన్నీ బయట పెడితే నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ నా మీద నిందలు వేస్తున్నారని కోట్ల రూపాయల డబ్బులు తీసుకు వెళ్ళాను, ఎవరెవరితోనో అక్రమ సంబంధాలు అంటగడుతూ మాట్లాడుతున్నారని అన్నారు. నరేష్ భార్యగా ఆయనకు సంబంధించిన అన్ని విషయాల గురించి అడిగే హక్కు తనకు ఉందని పేర్కొన్న ఆమె తన కుమారుడికి తండ్రి కావాలని, కానీ నరేష్ మాత్రం అలా లేకుండా చేస్తున్నాడని అన్నారు.


Click it and Unblock the Notifications











