షూటింగ్ కి డుమ్మా: హీరోయిన్ కు 4 కోట్లు ఫైన్
జగ్గేష్ కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. జగ్గేష్ బీజేపీలో ఉన్నారు. రమ్య కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. మాండ్యా నియోజకవర్గంలో ఇటీవల లోక్‌సభ బైపోల్‌లో గెలిచి ఎంపీగా పార్లమెంట్‌లో ప్రవేశించారు. జగ్గేష్ మాట్లాడుతూ "ఇది అనైతికం. సినిమా పూర్తి కావడానికి ఆమె సహకరించకపోవడం దారుణం. ఆమె పార్లమెంట్ సభ్యురాలు అయితే కావచ్చు. కానీ అంతకు ముందు ఆమె నటి అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇవాళ ఆమె ఈ స్థాయిలో ఉండటానికి కారణం సినిమానే అనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తే ఎలా? 'నీర్ దోసె' దాదాపుగా 60 శాతం పూర్తయింది.
నిర్మాత దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంత మొత్తాన్ని ఇప్పుడు ఎవరిస్తారు? ఆ నష్టాన్ని రమ్య భరిస్తుందా?'' అని ప్రశ్నించారు. రమ్య ఈ విషయం గురించి ఇప్పటిదాకా ఏమీ స్పందించలేదు. కానీ ఆమె సన్నిహితుల అభిప్రాయం మేరకు రమ్య రాబోయే ఎలక్షన్స్ మీద దృష్టి పెట్టిందట. ఇప్పట్లో సినిమాలకు కాల్షీట్ కేటాయించే పరిస్థితుల్లో లేదట. కానీ జగ్గేష్ ఏ విషయాన్నీ నిగ్గు తేల్చందే వదిలిపెట్టేలా లేరు. ఈ సమస్యను రమ్య ఎలా అధిగమిస్తుందో వేచిచూడాల్సిందే.


Click it and Unblock the Notifications












