కాంగ్రేస్ తరపున స్టార్ హీరోయిన్ ప్రచారం
బెంగళూరు : కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి ఇంతకాలం దూరంగా ఉంటూ వచ్చిన నటి రమ్య ఎట్టకేలకు ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం ఇక్కడి శివాజినగర నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రోషన్‌బేగ్ తరఫున ఆమె రోడ్ షోలో పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు మౌంట్‌కార్మెల్ కళాశాల నుంచి ఆరంభమైన రోడ్ షో అంబేద్కర్ భవన్ వరకు కొనసాగింది.
రోడ్డుకి ఇరువైపులా వందల సంఖ్యలో ప్రజలు బారులుతీరారు. అనూహ్య స్పందన లభించిందంని రమ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. విలేఖరులతో మాట్లాడుతూ 'ఎన్నికల ప్రచారంలో ఆలస్యంగా పాల్గొంటున్నట్లు వస్తున్న విమర్శల్లో వాస్తవంలేదు. ఇప్పటి వరకు సినిమా చిత్రీకరణకు లండన్ వెళ్లాను. ఇటీవలే వచ్చాను. పార్టీ నాయకుల సూచన మేరకే ఏయే ప్రాంతాల్లో పర్యటించేదీ నిర్ణయిస్తాను. వచ్చే ఆదివారం శాంతినగర నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటానని' చెప్పారు.
మరో ప్రక్క మండ్య నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి,నటుడు అంబరీష్ ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన వివిధ ప్రాంతాల్లో పాదయాత్రల్లో పాల్గొన్నారు. వందలాది మంది అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications












