సంసారానికి పనికిరాడని విడాకుల కోసం గాయని అర్జీ

By Srikanya

Ramya Vasishta seeks divorce from Rajesh Krishnan
బెంగళూరు : సినీ రంగంలోని దంపతుల మధ్య విభేదాలు, విడాకుల కేసులు తరచూ తెరపైకి వస్తున్నాయి. గతంలో కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన హీరో దర్శన్‌ జంట, ఇటీవల దునియా విజయ్‌ వివాదం. తాజాగా రెండుపెళ్లిళ్ల తరువాత మూడో వివాహం చేసుకున్న రాజేష్‌ కృష్ణన్‌ కాపురంలో కలతలొచ్చాయి. ఆయన సంసారానికి తగడంటూ భార్య, గాయని రమ్య వశిష్ట కోర్టుకెక్కింది.

వివరాల్లోకి వెళితే...ప్రముఖ యువ గాయకుడు రాజేష్‌ కృష్ణన్‌, గాయని రమ్య వశిష్ఠల పెళ్లి 15 నెలల్లోనే విడాకుల దిశగా పయనిస్తోంది. రాజేష్‌ కృష్ణన్‌ వ్యసనపరుడని, పురుషత్వం లేదనే ఆరోపణలతో రమ్య ఇక్కడి ఒకటో ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అర్జీ సమర్పించారు. ఏప్రిల్‌ నాలుగున విచారణకు హాజరు కావాలంటూ రాజేష్‌కు కోర్టు నోటీసుల్ని జారీ చేసింది. గత ఐదున ఆమె వేసిన అర్జీపై బుధవారం విచారణ జరిగింది.

రమ్యతో పెళ్లికి మునుపే రాజేష్‌కు రెండు వివాహాలయ్యాయి. మొదటి భార్యతో రెండున్నరేళ్లు, రెండవ భార్యతో రెండున్నరేళ్లు కాపురం చేసి విడిపోయారు. ప్రముఖ గాయకి బి.కె.సుమిత్ర కుమార్తె సౌమ్య రావు, హరిప్రియలు రాజేష్‌ కృష్ణన్‌ మాజీ భార్యలు. రమ్యను నవంబరు, 2011లో కొల్లూరు మూకాంబిక ఆలయంలో మనువాడారు. బెంగళూరు ప్యాలెస్‌ మైదానంలో నవంబరు 11న బంధు మిత్రులకు భారీ విందు ఇచ్చారు.

భర్త సంసార సుఖానికి పనికిరాడని, పురుషత్వం లేదని ఆరోపిస్తూ రమ్య గత ఏడాది నవంబరు నుంచి భర్త నుంచి విడిపోయి పుట్టింటికి చేరుకుంది. విడాకుల్ని ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా ఆయన పట్టించుకోలేదని, దీంతో కోర్టుకు ఎక్కాల్సి వచ్చిందని అర్జీలో పేర్కొన్నారు. కృత్రిమ గర్భధారణ పద్ధతి పాటించాలని రాజేష్‌ సూచించగా ఆమె అంగీకరించలేదు.

లైంగిక వైద్య నిపుణుడ్ని కలిసి చికిత్స చేయించుకోమన్న తన సూచనను రాజేశ్‌ పెడచెవిన పెట్టాడని రమ్య ఆరోపించారు. అర్జీ విచారణను స్వీకరించిన న్యాయమూర్తి విచారణకు హాజరు కావాలంటూ రాజేష్‌కు నోటీసుల్ని జారీ చేశారు. మరో యువతితోను, మరో నటితోను ఆయన సన్నిహితంగా ఉంటున్నారని భార్య ఆరోపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X