యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో సెక్సీ హీరోయిన్ గెలుపు
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా...గ్లామర్ ఉన్నప్పుడే రాజకీయాల్లో పాతుకు పోవాలని ప్లాన్ చేసిన కన్నడ హీరోయిన్ రమ్య తొలి మెట్టును అవలీలగా అధిగమించింది. కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టిందే ఆలస్యం..యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించింది. సోమవారం(సెప్టెంబర్ 19) జరిగిన ఎన్నికలో కర్నాటక యూత్ కాంగ్రెస్ పదవుల కోసం శాంతి నగర్లోని 3వ నెంబర్ బూత్ నుంచి పోటీ చేసి గెలుపొందింది. ఇది బెంగుళూరు సెంట్రల్ లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. ఈ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కార్యదర్శుల పదవులకు అర్హులు. రమ్య కూడా ఆ పదవుల కోసం పోటీ చేయడానికి అర్హత సాధించింది.
పలు కన్నడ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన రమ్య....హీరోయిన్‌గా సక్సెస్ కాలేక పోయింది. ఆమె అందం, అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నా ఆమె నటించిన సినిమాలు వరుసగా ప్లాపు కావడంతో రమ్యకు అవకాశాలు తగ్గి పోయాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలపై దృష్టి సారించిన అమ్మడు ఈ మేరకు ఓ ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతోంది. రాజకీయ ప్రసంగాలు దంచుతూ జయలలిత, జయప్రద మాదిరి అధికారంలోకి రావాలని కలలు కంటోంది. మరి ఈ కన్నడ కస్తూరి రాజకీయ ప్రయాణం ఎలా సాగుతుందో? చూడాలి.


Click it and Unblock the Notifications











