ఊరి చివరి ఇంట్లో- వేశ్యగా రమ్యకృష్ణ
హీరోయిన్ గా వందల చిత్రాలలో నటించిన రమ్యకృష్ణ పెళ్లి చేసుకుని తల్లి కూడా అయింది. ఇపుడు జరా ధూమ్ జరా మస్తీ టీవీ ప్రోగ్రామ్ తో బిజీగానే గడుపుతోంది. తులసి సినిమాలో గెస్ట్ రోల్ అయినా మొహపాటపడకుండా చేసింది. తాజాగా ఆమెకు ఊరి చివరి ఇంట్లో సినిమాలో అవకాశం లభించింది. తిలక్ రాసిన షార్ట్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా రూపొందనున్నది. తిలకే ఈ కథను సినిమాగా తీయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కోసం గణేష్ పాత్రో మాటలు రాస్తున్నారు. స్క్రిప్ట్ రచన సాగుతోంది. ఒక వేశ్య ముక్కోణపు ప్రేమ కథకు సంబంధించినది. ఈ పాత్ర కోసమే రమ్యకృష్ణను సంప్రదించారు. కథ వినగానే రమ్యకృష్ణ ఒప్పుకుందట. అదీ విశేషం.


Click it and Unblock the Notifications











