రమ్య కృష్ణ...షాకింగ్ రెమ్యూనరేషన్!
హైదరాబాద్: నిన్నటి తరం స్టార్ హీరోయిన్ రమ్య కృష్ణ అప్పట్లో వెండితెర సెన్సేషన్. పెర్ఫార్మెన్స్ పరంగానే కాదు... అందం పరంగా, ఎక్స్ ఫోజింగ్ పరంగా హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది. హీరోయిన్ అవకాశాలు తగ్గిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ పరిశ్రమలో ఇంకా తన సత్తా చాటుతోంది.
తాజాగా రమ్య కృష్ణ ఓ తమిళ సినిమాకు ఏకంగా రూ. 90 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటుండటం చర్చనీయాంశం అయింది. విశాల్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి రమ్యకృష్ణ ఈ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆమె 30 కాల్షీట్లు కేటాయించిందని, ఒక్కో కాల్షీటుకు రూ. 3 లక్షల చొప్పున రూ. 90 లక్షలు వసూలు చేస్తున్నట్లు టాక్.

అంబాలా పేరుతో తెరకెక్కుతున్న తమిళ చిత్రంలో హన్సిక హీరోయిన్‌గా నటిస్తోంది. వీరితో పాటు ఈ చిత్రంలో కిరణ్ రాథోడ్, ఐశ్వర్య తదితరులు కూడ ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. విశాల్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా....రమ్యకృష్ణ రెమ్యూనరేషన్ రూ. 90 లక్షలు ఉండటం పరిశ్రమ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. హీరోయిన్లతో సమానంగా ఆమెకు రెమ్యూనరేషన్ ఇవ్వడం బట్టి చూస్తే సినిమాలో రమ్యకృష్ణ పోషించేది చాలా కీలకమైన పాత్ర అని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











