»   » రానా స్పీక్స్ : ‘బాహుబలి’ ప్రచారం ముమ్మరం (కొత్త వీడియోలు)

రానా స్పీక్స్ : ‘బాహుబలి’ ప్రచారం ముమ్మరం (కొత్త వీడియోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ‘బాహుబలి' విడుదల సమయం దగ్గరపడుతోంది. ఈ సమయంలో ప్రమోషన్స్ వేగవంతం చేసారు చిత్రం టీమ్. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న రానా...చిత్రం గురించి మాట్లాడి అందరి దృష్టినీ మరోసారి తమ సినిమావైపు తిప్పుకునే ప్రయత్నం చేసారు. ఆ వీడియో మీరూ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


July 10th, Baahubali's release day, is almost here! Rana has a message for all of you about the big day.. Take a look -


Posted by Baahubali on 1 July 2015

ప్రచార చిత్రాల్ని చూసి అందులోని సాంకేతికత గురించి హాలీవుడ్‌ సైతం చర్చించుకొంటోంది . తెలుగు,తమిళ, హిందీ,మళయాళ భాషల్లో విడుదల చేయటానికి రెడీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రపంచ ప్రేక్షకుల కోసం ఈ చిత్రంలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ టీమ్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చిత్రం రిలీజ్ కుచెందిన ప్రమోషన్ వీడియో ఇక్కడ చూడండి.


9 days to go. #LiveTheEpic


Posted by Baahubali on 1 July 2015

దాదాపు రూ: 200కోట్ల పైచిలుకు వ్యయంతో రూపొందిన 'బాహుబలి' గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రం సెన్సార్ పనులను పూర్తిచేసుకుని యు/ఏ సర్టిఫికేట్ ని అందుకుంది. దీంతో సినిమాకు సంబందించిన కార్యక్రమాలు దాదాపు పూర్తిచేసుకున్న చిత్ర బృందం జులై 10న భారీ విడుదలకు సిద్ధమవుతుంది.


Rana about Baahubali movie

చిత్రం గురించి రాజమౌళి మాట్లాడుతూ.... ''ప్రభాస్‌తో 'బాహుబలి' చేయాలని ఆరేళ్ల క్రితమే నిర్ణయించుకొన్నా. నా సినిమాల్లో విలన్ కు చాలా ప్రాధాన్యముంటుంది. తను ఎంత బలంగా ఉంటే... హీరో పాత్ర అంత బలంగా ఎలివేట్‌ అవుతుంది. అందుకే ప్రభాస్‌కంటే ఎత్తు, ప్రభాస్‌ కంటే బలంగా ఉన్న నటుడు కావాలనుకొన్నా. ఆ సమయంలో నాకు రానానే గుర్తొచ్చాడు. ఓసారి రానాని కలసి భళ్లాలదేవ పాత్ర గురించి చెప్పా. ఏం మాట్లాడకుండా వెళ్లిపోయాడు.


మళ్లీ ఓ రోజు నా దగ్గరకు వచ్చి 'హీరోగా నటిస్తున్నా, వేరే భాషల్లో సినిమాలు చేస్తున్నా. ఇలాంటి సమయంలో ప్రతినాయకుడిగా కనిపించడం సరైనదేనా? మీరే సలహా ఇవ్వండి' అని నన్నే అడిగాడు. 'నేనేం చెప్పానో, నీ పాత్రని ఎలా తీర్చిదిద్దుతాను అన్నానో... అలానే తీస్తా.. నువ్వే నిర్ణయం తీసుకో..' అన్నాను.


రెండుమూడు గంటలు ఆలోచించుకొని 'నేను భళ్లాలదేవాగా నటించడానికి సిద్ధమే' అన్నాడు. పైకి అలా కనిపిస్తాడుగానీ మనిషి చాలా సున్నితం. ఈ సినిమా ముగిశాక మా అందరికీ ఓ ఉత్తరం రాశాడు. ఈ టీమ్‌తో తనకున్న అనుబంధం పంచుకొన్నాడు. ఆ లెటర్‌ చూశాక మాకు కన్నీళ్లు ఆగలేదు. తనలో మంచి రచయిత ఉన్నాడనిపించింది. అందుకే 'బాహుబలి2'కి రచయితగా పనిచేయమని చెప్పా.


ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం 'బాహుబలి'. రాజమౌళి దర్శకత్వం వహించారు.శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. కీరవాణి సంగీతం అందించారు.
English summary
July 10th, Baahubali's release day, is almost here! Rana has a message for all of you about the big day.. Take a look -
Please Wait while comments are loading...