చంద్రబాబు చరిత్ర మొత్తం తవ్వుతున్న రానా!
ఆరడుగుల ఆజానుబాహుడు రానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు పాత్రలో నటించడం అంత సులువైన విషయం కాదు. చంద్రబాబు దెస రాజకీయాల్లోనే పేరుమోసిన నేత. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించడం అంటే.. చంద్రబాబు యుక్తవయసు ఉన్నప్పటి నుంచి ఆయన పాత్రలో రానా నటించాల్సి ఉంటుంది.
సవాలుతో కూడుకున్న ఈ పాత్ర కోసం రానా అప్పుడే అధ్యయనం మొదలుపెట్టేశాడు. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతో ఈ పాత్రకు సంబందించిన హోమ్ వర్క్ గురించి రానా ప్రస్తావించాడు. చంద్రబాబు గారి గురించి అధ్యయనం చేయడం మొదలుపెట్టినట్లు తెలిపాడు.

25 ఏళ్ల వయసులో స్టూడెంట్ లీడర్ గా ఉన్న సమయం నుంచి చంద్రబాబు గారి ఫోటోలు, వీడియోలు చూస్తున్నానని తెలిపాడు. చంద్రబాబు బాడీ లాంగ్వేజ్, మాట సరళి వంటి విషయాల్లో అవగాహన పెంచుకుంటున్నట్లు రానా తెలిపాడు.


Click it and Unblock the Notifications











