Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్‌ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పూరి జగన్ పై మండిపడ్డ రాణా
దగ్గు పాటి రానా తాజా చిత్రం 'నా ఇష్టం'త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో పూరీ జగన్నాధ్ తో తాను చేసిన 'నేను నా రాక్షసి'సినిమా తనని చాలా ఇబ్బంది పెట్టింది అని ఇన్ డైరక్ట్ గా దర్శకుడు పూరీ జగన్ పై బాణాలు సంధించారు.
ఆయన మాట్లాడుతూ...నా ఖాతాలో ఒక ఫ్లాప్ సినిమా కూడా ఉంది. ఆ సినిమా నాకు మంచి గుణ పాఠం నేర్పింది . 'నేను నా రాక్షసి' చిత్రం నాకు మంచి గురువులాంటిది. ఆ సినిమాతో కోల్పోయింది ఎంతో ఉంది. దాన్ని ఏం చేయాలో మాకైతే అర్థం కాలేదు. ముందుగా అనుకున్నది ఒకటైతే అంతా అయ్యాక తెరపై కనిపించింది మరొకటి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ సినిమా గురించి మాట్లాడుకోవటానికి ఏమీ మిగల్లేదు. నిర్మాతగా మా నాన్నగారికి, నటుడిగా 25 సంవత్సరాల అనుభవమున్న మా బాబాయి వెంకటేష్‌గారికి ఆ చిత్రం ఒక పట్టాన కొరుకుడుపడలేదు. సరే సినిమా పూర్తయ్యింది కదా అనుకుంటే దాన్ని మార్కెట్లోకి ఎలా తీసుకువెళ్లాలనే డైలమాలో పడిపోయాం. సినిమా ఫస్టాఫ్ బ్రహ్మాండంగా వచ్చింది. కానీ ఆ తర్వాతే సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది. సినిమాను థియేటర్లో చూస్తున్న జనాలు నాకు ఫోన్ చేసి హిట్ ఖాయమని చెప్పారు. ఇంటర్వెల్ తర్వాత ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు. 'నేను నా రాక్షసి' గురించి ఇంతకు మించి ఏం చెప్పగలను'' అన్నారు.
అలాగే ఎప్పుడైతే ఒక ప్రయోగంతో ప్రయోగం చేయాలనుకుంటారో అక్కడే సమస్య వస్తుంది. సినిమా కాన్సెప్ట్ గొప్పగా ఉండవచ్చు. కానీ మీరు దాన్ని తెరపై ఎంత క్లారిటీతో చెప్పగలరనేదే ఇక్కడ ముఖ్యం. అలా లేనిపక్షంలో తెరపై దాన్ని అర్ధం చేసుకోవటం మనవల్ల కాదు అని చెప్పుకొచ్చారు. ఇక త్వరలో విడుదలవుతున్న 'నా ఇష్టం' సినిమా కోసం మునుపెన్నడూ లేని విధంగా జెనీలియాతో డ్యాన్స్ చేశాను. సినిమా పరిభాషలో చెప్పాలంటే నేను తొలిసారిగా నటిస్తున్న కమర్షియల్ చిత్రం ఇదే అనుకుంటా అన్నారు. అలాగే తాను తెలుగు పరిశ్రమను ఓవర్ లుక్ చేయకుండా బాలీవుడ్ పై కాన్సర్టేట్ చెయ్యాలనుకుంటున్నట్లు చెప్పారు.